డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే.. వాహనం ఉక్రెయిన్ కే?

praveen
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతుంటే.. మరి కొంతమంది తమ నిర్లక్ష్యం కారణంగా అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకువస్తున్నారు. ఇక మరి కొంతమంది మద్యం తాగి వాహనం నడపడం నేరమని తెలిసినప్పటికీ మద్యం మత్తులోనే వాహనాలు నడుపుతూ ఇక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు అని చెప్పాలి. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక ఇలాంటి పరిస్థితి నెలకొంది.

 మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి కఠినమైన శిక్షలు విధిస్తున్నప్పటికీ వాహనదారులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. వెరసి ఇక ఇటీవల కాలంలో మరోసారి మద్యం తాగి వాహనం నడపాలంటేనే భయపడే విధంగా అన్ని దేశాలు కూడా కఠిన శిక్షలు విధించేందుకు సిద్ధమవుతూ ఉన్నాయ్ అని చెప్పాలి. ఇప్పటికే మన దేశంలో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి భారీగా జరిమానాలు విధిస్తూ జైలు శిక్ష కూడా విదిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఉత్తర ఐరోపాలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడపాలి అంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఒక శిక్షను విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లాత్వియా దేశ అధికారులు తాగి కారు నడిపిన వారికి వినూత్న  రీతిలో శిక్ష విధించబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసి ఉక్రెయిన్ సైన్యానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ఇలా పట్టుబడిన 1200 వెహికల్స్ ని కూడా ఉక్రెయిన్  సైన్యానికి అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక ఇలా పంపించిన వాహనాలను సైన్యం వారి అవసరాల కోసం వాడుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలిసి వాహనదారులందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: