30 ఏళ్ళ క్రితం మిస్సింగ్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిందిగా?

praveen
విధి చాలా విచిత్రమైనది .. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు. అదృష్టం తోడైతే 30ఏళ్ల క్రితం తప్పిపోయిన వారు కూడా తిరిగి ఇంటికి వస్తారు. అచ్చం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ప్యాటిసియా కోప్టా అనే మహిళ సరిగా 30ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇక ఆమె దొరకదు అని నిర్ణయానికి వచ్చిన అధికారులు ఆమె చనిపోయినట్టుగా డిక్లేర్ చేసి కేసును కూడా క్లోజ్ చేశారు.కానీ సదరు మహిళ ఇప్పుడు తిరిగి రావడంతో అటు పోలీసులు తో పాటు ఇటు కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు.
ప్యాటిసియా కు తన ఏరియాలో మంచి టీచరుగా పేరుంది కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె ఎలా మిస్ అయిందో కూడా తెలీదు చివరిసారిగా 1999లో ప్యూర్టో రికో కనిపించింది కానీ ఆ తర్వాత ఆమె గురించి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఆమెకు భర్త తో పాటు ఒక కవల సోదరి మరో ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం తన భర్త మళ్లి పెళ్లి చేసుకోకుండా తన భార్య వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నాడు. తన ఇద్దరి చెల్లెలు కూడా కన్నుమూశారు. ఒకే ఒక చెల్లెలు మాత్రమే బ్రతికి ఉంది. ఇక ఆమె చెల్లి మరియు భర్త ప్యాటిసియా బ్రతికి ఉందని తెలిసి ఒకింత ఆనందానికి మరింత షాక్ కి గురవుతున్నారు.

ప్యాటిసియా కరేబియన్ దీవుల్లోని ప్యూర్టో రికో నగరంలో ఒక నర్సింగ్ హోమ్ లో నివసిస్తోంది. ఆమె తన గతాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచింది. అలాగే ప్రస్తుతం ఆమె కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతోంది. ప్యాటిసియా వయసు ఇప్పుడు 80 ఏళ్లు. ఆమె తప్పిపోవడానికి ముందు ఎప్పుడూ ఆ నగరానికి వెళ్ళింది లేదు. అక్కడికి ఎలా వెళ్లిందో తెలియడం లేదు. కానీ ఆమె కొన్ని రోజుల తర్వాత తనకు సంబంధించిన వివరాలను చెప్పడం మొదలుపెట్టింది. దాంతో సదరు నర్సింగ్ హోమ్ నిర్వాహకులు పోలీసులను సంప్రదించగా ఆమె బ్రతికి ఉందన్న విషయం అందరికి తెలియ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: