అమ్మాయిలపై నిషేధం.. అబ్బాయిలతో లోదుస్తులు ప్రకటన?

praveen
ఇటీవల కాలం లో ఆన్లైన్ ఓపెన్ చేస్తే చాలు ఎన్నో రకాల ప్రకటనలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక ఇందులో మహిళలు వేసుకునే లోదుస్తులకు సంబంధించిన ప్రకటనలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎంతోమంది మహిళలు ఇలా లోదుస్తులు వేసుకొని ప్రకటనల్లో కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ ప్రకటనల విషయంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక లోదుస్తువుల ప్రకటనలో అమ్మాయిలు కనిపించకూడదు అంటూ నిషేధం విధించింది. దీంతో అక్కడి వ్యాపార నిర్వహకులు అందరూ కూడా కొత్త ఆలోచనకు తెర లేపారు.

 సాధారణంగా లోదుస్తుతులను అమ్మాయిలు ధరించి ప్రకటన చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం చైనాలోని వ్యాపార నిర్వాహకులు అమ్మాయిలపై నిషేధం ఉన్న నేపథ్యంలో అబ్బాయిలకు లో దుస్తులు ధరింపజేసి ఇక  ప్రకటనలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. లోదుస్తులకు సంబంధించిన ప్రకటనలో అమ్మాయిలు ఉండడం ద్వారా అశ్లీలత పెచ్చు మీరుతోందని చైనా ప్రభుత్వం భావించి నిషేధం విధించింది.

 ఈ క్రమంలోనే అమ్మాయిల లోదుస్తులు వేసుకున్న పురుష మోడల్స్ వీడియోలు ప్రస్తుతం అక్కడ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోతున్నాయి. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయని చెప్పాలి. ఒకవేళ ఆ వీడియోలో ఉన్నది మహిళా మోడల్ అయితే ఆ సంస్థ పరిస్థితి వేరేలా ఉండేది. తర్వాత క్షణంలోనే ఆ సంస్థ మూతపడేది.. అందుకే పురుష మోడలతో వీడియో తీస్తుంది అంటూ ఒక నేటిజన్ కామెంట్ చేశాడు. ఎందుకో ఇలాంటి లోదుస్తులు అమ్మాయిలు కంటే అబ్బాయిలకే బాగున్నాయి అని మరో యూసర్ ఇక ఫన్నీ కామెంట్ చేశాడు అని చెప్పాలి. ఏది ఏమైనా ఇలా అబ్బాయిలతో అమ్మాయిల లోదుస్తుల ప్రకటనలు చేయించడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: