పిచ్చి పీక్స్ అంటే ఇదే.. బ్రతికుండగానే అంత్యక్రియలు చేసుకున్నాడు?

praveen
సాధారణంగా మనుషుల్లో మిగతా జీవులతో పోల్చి చూస్తే కాస్త ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇక అయితే ఇలాంటి ఆలోచన శక్తి ఉంటే పర్వాలేదు. కానీ కొంతమందిలో మాత్రం తెలివి కాస్త మితిమీరిపోయి విచిత్ర విచిత్రమైన పనులు చేయడం లాంటివి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇక ముందుగానే ప్రాణాలు తీసుకుని పిచ్చి పనులు చేస్తున్న వారు కొంతమంది అయితే.. ఏకంగా తాను చనిపోతే ఎవరు ఏడుస్తారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సినిమాల్లో లాగానే ముందుగా చనిపోయినట్టు నటిస్తున్న వారు మరి కొంతమంది.

 ఇలా పిచ్చి ఆలోచనలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోతున్నవారు నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఒక వృద్ధుడు చేసిన పని కాస్త ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. పిల్లలకు దూరంగా ఎన్నో ఏళ్ల నుంచి ఒంటరిగానే జీవిస్తున్నాడు ఆ వృద్ధుడు. ఇటీవలే అతని మనసులో ఒక వింత ఆలోచన తట్టింది.

 ఒకవేళ తాను చనిపోతే అంత్యక్రియలు ఎలా జరుగుతాయో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే వింత ఆలోచన చేశాడు. ఇక బ్రతికుండగానే స్థానికుల సమక్షంలో అంత్యక్రియలు జరుపుకున్నాడు సదరు వృద్ధుడు. చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. అంత్యక్రియల్లో భాగంగా జాంగ్ అనే 84 ఏళ్ల వ్యక్తి.. శవ పేటికపై కూర్చొని ఊరేగాడు. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఎన్నో ఏళ్ల నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న జాంగ్ లో ఇక ఇది ఎంతో ఉత్సాహాన్ని నింపింది అంటూ స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: