టిక్ టాక్ కి మరో షాక్.. అక్కడ కూడా బ్యాన్?

praveen
టిక్ టాక్.. ఈ పేరు గురించి కొత్తగా నెటిజెన్స్ కి  పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే అన్ని యాప్స్ లాగానే ఒక సాదాసీదా యాప్ గా భారత్ లో ఎంట్రీ ఇచ్చింది టిక్ టాక్. కానీ తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. యూత్ అందరిని కూడా తన బుట్టలో వేసుకుంది. కేవలం యూత్ మాత్రమే కాదు పెద్దలు సైతం ఇక ఈ యాప్ కి ఎడిక్ట్ అయిపోయారు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే అప్పటివరకు ఎక్కడా లేని విధంగా వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందించి ఇండియాను మొత్తం ఊపేసింది టిక్ టాక్ యాప్ అని చెప్పాలి. అంతేకాదు ఎంతోమందికి సెలబ్రిటీ హోదాను కూడా తెచ్చి పెట్టింది.

 ఇంకేంతో మంది యువతీ యువకులకు తమలో దాగి ఉన్న నటన ప్రతిభను కూడా బయటపడేలా చేసింది అని చెప్పాలి. ఇలా అన్ని యాప్స్ ని వెనక్కి నెట్టి టాప్ లో కొనసాగుతున్న సమయంలోనే ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ యాప్ కి షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇది చైనాకు సంబంధించిన యాప్ కావడంతో ఇక ఎంతోమంది వినియోగదారులకు సంబంధించిన పర్సనల్ సమాచారాన్ని తస్కరించి చైనాకు అందజేస్తుంది అన్న కారణంతో చివరికి పూర్తిగా నిషేధం విధించింది.  టిక్ టాక్ పై నిషేధం విధించిన తర్వాత కొంతమంది యువత పిచ్చివాళ్ళలా ప్రవర్తించడం కూడా చేశారు.

 ఇక భారత్ తర్వాత మరికొన్ని దేశాలు సైతం ఈ యాప్ పై నిషేధాజ్ఞలు జారీ చేశాయి అని చెప్పాలి.  ఇక ఇప్పుడు చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పై మరో దేశం నిషేధం విధించింది. కెనడా ప్రభుత్వం టిక్ టాక్ ను బ్యాన్ చేస్తు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి చెందిన అన్ని రకాల డివైస్ లపై నిషేధం అమలవుతుందని ప్రకటించింది. ఈ యాప్ తో ప్రైవసీ, భద్రతకు ముప్పు ఉండటం వల్లే నిషేధం విధించినట్లు ఆ దేశ ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక ఈ యాప్ వినియోగంపై ప్రజలు ఆలోచించుకోవాలి అంటూ సూచించింది కెనడా ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: