పెళ్లి చేసుకునే వారికి.. గుడ్ న్యూస్ చెప్పిన చైనా ప్రభుత్వం?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది . పాతికేళ్ల ప్రాయంలో ఇక జీవితాంతం సంతోషంగా ఉండడానికి ఒక అందమైన భాగస్వామినీ ఎంచుకునే అవకాశం వస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక తమను అర్థం చేసుకుంటారు అని నమ్మకం ఉన్న భాగస్వామిని ఎంచుకొని ఇక పెళ్లికి సిద్ధపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి జరుగుతున్న సమయంలో బంధుమిత్రులు అందరితో కూడా ఉండే హడావిడి అంతా అంతా కాదు. అయితే ఇక పెళ్లి జరిగిన సమయంలో దాదాపు వధూవరులు ఇద్దరు కూడా ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఇక ఉద్యోగానికి కొన్నాళ్లపాటు సెలవు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలంలో ఇలా పెళ్లి కోసం సెలవులు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలు సెలవు అడిగితే చాలు తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులని పూర్తిగా ఇక జాబ్ నుంచి తీసేస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో ఇటీవల చైనా ప్రభుత్వం మాత్రం కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే యువతి యువకులందరికీ కూడా ఒక తీపి కబురు చెప్పింది. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం అక్కడి యువత మొత్తం  సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఏకంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి నెలరోజుల పాటు సెలవులు ఇచ్చేందుకు నిర్ణయించింది చైనా ప్రభుత్వం. అది కూడా సాలరీతో కూడిన సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక తాజా ప్రకటనల ద్వారా జననాల  సంఖ్య పెరుగుతుందని చైనా ప్రభుత్వం భావిస్తూ ఉంది అని చెప్పాలి. కాగా గత కొంతకాలంగా చైనాలో జననాల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జననాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాగా చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం ఇక యువత సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా ఈ ప్రభావం ఆర్థిక అభివృద్ధి పై పడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: