దొంగల భయంతో.. డబ్బును డస్ట్ బిన్ లో దాల్చింది.. కానీ చివరికి?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద కాస్త ఎక్కువగానే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా దొంగల నుంచి తమ సంపదకు రక్షణ కల్పించేందుకు ఇంటి యజమానులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక తమ డబ్బును భద్రంగా దాచుకున్నామని అనుకున్నప్పటికీ దొంగలు మాత్రం చాకచక్యంగా వ్యవహరించి అందిన కాడికి దోచుక పోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి ఘటనలు ఆయా ఇంటి యజమానులకు ఊహించిన షాక్ లు ఇస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక కొంతమంది అయితే ఏకంగా లాకర్లను కొనుగోలు చేసివాటిలో విలువైన వస్తువులు నగదు దాచుకుంటే దొంగలు ఏకంగా లాకర్లను ఎత్తుకు వెళుతూ ఉండడం కూడా కనిపిస్తూ ఉంది.

 ఈ క్రమంలోనే ఇలా దొంగలకు దొరక్కుండా ఉండేందుకు కొంతమంది ఇక తమ దగ్గర ఉన్న విలువైన వస్తువులను వింతైన రీతిలో దాచి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది అయితే సినిమాల్లో చూపించినట్లుగా కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే పిచ్చి పనులు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా సినిమాల్లో ఇక డబ్బు ఎవరి కంటా పడకుండా ఉండేందుకు ఎవరికీ అనుమానం రాకుండా చెత్తకుప్పల్లో దాచిపెట్టడం లాంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నిజ జీవితంలో డబ్బులు చెత్తకుండీలో దాచిపెట్టడానికి ఎవరూ సాహసం చేయరు. కానీ ఇక ఇటీవల నిజజీవితంలో కూడా ఇలాంటి తరహా ఘాటనే జరిగింది అని చెప్పాలి.

 డబ్బు ఇంట్లో ఉంటే దొంగలు పడతారని భావించిన ఒక మహిళ అతి తెలివి ప్రదర్శించింది. దుబాయిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఏకంగా టూర్కు వెళుతూ వెళుతూ 1.83 కోట్ల రూపాయలను డస్ట్ బిన్లో దాచి పెట్టింది. కానీ ఆమె ప్లాన్ బెడిసి కొట్టింది. హాయిగా టూర్ కి వెళ్లి తిరిగి వచ్చేసరికి డబ్బు మాయమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఇక సదరు మహిళ ఉంటున్న కాంప్లెక్స్ లో ఒక అపార్ట్మెంట్లో ఏసి రిపేర్ చేయడానికి వచ్చిన కొంతమంది వ్యక్తులు.. ఇక ఆ డబ్బును తీసుకొని  పంచుకున్నారు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: