భార్య భర్తలు ఇద్దరికీ.. ఒకేసారి షాక్ ఇచ్చిన గూగుల్?

praveen
ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తే ఇక అంతకంటే ఇంకేం కావాలి అని అనుకునేవారు. మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చి భారీ జీతం ఆఫర్ చేస్తే జీవితం మొత్తం సాఫీగా సాగిపోతుంది అని భావించేవారు. అయితే ఇటీవల కాలంలో ఇలా మల్టీ నేషనల్ కంపెనీలుగా కొనసాగుతున్న కంపెనీలు ఏకంగా ఉద్యోగులను అర్ధాంతరంగా  జాబ్ నుంచి పీకేస్తున్న ఘటనలు ఎంతో మందికి షాప్ ఇస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలా పెద్ద కంపెనీలలో పనిచేస్తూ ఉన్నఫలంగా  ఉద్యోగాలు కోల్పోయి రోడ్డును పడుతున్న ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి.

 దీంతో ఇలా పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలుకుతూ ఉండడం లాంటి ఘటనలు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉన్నాయి. తమ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే గ్యారెంటీ లేకుండానే ప్రతిరోజు భయం భయంగా ఆఫీసుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం చేయాల్సిన పనికంటే కాస్త ఎక్కువగానే చేస్తున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడి మధ్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా దిగజ కంపెనీలలో లే ఆఫ్స్ ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.

 ఇక ఇటీవలే భార్యా భర్తలు ఇద్దరికీ కూడా గూగుల్ ఒకే సారి ఊహించని షాక్ ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఒకేసారి జాబ్ నుంచి తొలగించింది. స్టేవ్, అలై దంపతులకు నాలుగు నెలల చిన్నారి ఉంది. అయితే స్టీవ్ ఆరేళ్లుగా అలై నాలుగేళ్లుగా గూగుల్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇక తమ నెలల బిడ్డ కోసం కొంత కాలం సెలవు పెట్టాలని ఇద్దరు భార్యా భర్తలు భావించారు. అయితే వారిద్దరికీ సెలవు మంజూరు లెటర్ వస్తుందని అనుకున్నారు. కానీ వారిద్దరికీ సంస్థ నుంచి లే ఆఫ్ లెటర్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: