బాయ్ ఫ్రెండ్ ను కత్తితో పొడిచిన యువతి.. ఎందుకో తెలిస్తే షాకే?

praveen
ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం లో బ్రతుకుతుంది మనుషుల లేకపోతే మనుషుల రూపం లో ఉన్న మానవ మృగాలా అన్నది కూడా అర్థం కాని విధంగా మారి పోయింది పరిస్థితి. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు సభ్య సమాజం లో ఉన్నది జంతువుల కంటే ప్రమాదకరమైన మనుషులు అన్న విషయం అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాయి.  చిన్నచిన్న కారణాలకే ఉన్మాదులుగా మారి పోతున్న మనుషులు సాటి మనుషులపై ఎంతో రాక్షసత్వం తో ప్రవర్తిస్తున్న తీరు అందరిని భయాందోళనకు గురి చేస్తుంది అని చెప్పాలి.

 ముఖ్యంగా ఇటీవల కాలం లో ప్రేమ అనేది ఎంతో మంది దారుణం గా హత్యలకు గురి అయ్యే పరిస్థితిని తీసుకు వస్తుంది. అయితే సాధారణంగా ప్రేమలో ఉన్న తర్వాత ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటారు.  అంతేకాదు ఏ చిన్న తప్పు చేసిన చేసిన ఒకరిని ఒకరు పెద్ద మనసుతో క్షమించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు.  కానీ ఇటీవల కాలంలో మాత్రం ప్రేమించిన వారే యమకింకరులుగా మారిపోతున్నారు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా తన బైక్ పై బాయ్ ఫ్రెండ్ మూత్రం పోసాడు అన్న కారణంతో దారుణంగా అతనిపై కత్తితో దాడికి దిగింది ప్రియురాలు. అమెరికాలోని లూసియానాలో ఈ ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. ఇద్దరూ మద్యం సేవించి ఇంటికి వచ్చారు. ఆకస్మాత్తుగా నిద్రలేచిన నిందితురాలు ఆమె బాయ్ ఫ్రెండ్ తన బైక్ పై యూరిన్ పోసాడని గమనించి.. కోపంతో ఊగిపోయింది. దీంతో విచక్షణ కోల్పోయింది. ఇక ప్రియుడు చేసిన చిన్న తప్పుకే  కత్తితో దాడికి దిగింది. దీంతో ఆమె నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: