కంటిచూపు లేకపోయినా.. ఆ పని చేసి వరల్డ్ రికార్డు కొట్టిన గుర్రం?

praveen
సాధారణంగా జనాలు చాలామంది ఇక వరల్డ్ రికార్డులు కొట్టి తమ పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేయాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ రికార్డు సాధించడం అనేది మాట్లాడుకున్నంత ఈజీ కాదు అన్న విషయం కేవలం కొంతమందికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరితో పోల్చి చూస్తే మనలో ప్రత్యేకమైన ప్రతిభ ఉన్నప్పుడు మాత్రమే ఇక ఇలా ప్రపంచ రికార్డులు సృష్టించేందుకు అవకాశం ఉంటుంది.

 ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ రికార్డులను కొట్టేందుకు కొంతమంది ఏకంగా ఏళ్ల తరబడి కఠోరమైన శిక్షణ తీసుకొని ఇక వరల్డ్ రికార్డు సాధించడం కోసం బరిలోకి దిగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇక ప్రపంచ రికార్డు సాధించాలనే పట్టుదలతో ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు ఇటీవల కాలంలో ఏకంగా జంతువులు సైతం వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఏకంగా ఒక గుర్రం మూడు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది .

 అయితే ఇలా మూడు వరల్డ్ రికార్డులు సాధించిన ఆ గుర్రం ఒక అంద గుర్రం కావడం గమనార్హం. అదేంటి అంద గుర్రం రికార్డు ఎలా సాధించింది అని ఆశ్చర్యపోతున్నారు కదా. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎండో అనే అంద గుర్రం 13 ఏళ్ల నుంచి వాగ్నర్ అనే మహిళ వద్ద ఉంటుంది. ఇక తన చిన్న వయసులోనే యువటిస్ అనే వ్యాధి కారణంగా చూపును కోల్పోయింది గుర్రం. చిన్న వయసులోనే కళ్ళు కోల్పోయినప్పటికీ ఇక వాగ్నర్ ఇచ్చిన ప్రత్యేకమైన శిక్షణ కారణంగా అత్యధిక ఫ్రీ జంప్, నిమిషంలో 39 ఫ్లయింగ్ చేంజెస్, 6.93 సెకండ్లలో ఐదు స్తంభాలను దాటి వరల్డ్ రికార్డు సృష్టించింది ఈ గుర్రం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: