వార్నీ.. 18 ఏళ్ళకే మేయర్ అయ్యాడు?

praveen
సాధారణంగా మన దేశంలో 18 ఏళ్ల వయస్సు వస్తేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే  అయితే 18 ఏళ్ల వయసులో  ఎవరైనా సరే మేజర్లుగా మారిన యువకులు ఇక తమ మొదటి ఓటును వినియోగించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఎవరైనా ఇలా మొదటిసారి ఓటు హక్కు పొందిన సమయంలోనే ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తూ ఉంటారా.. దాదాపుగా అలా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ రాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఒకవేళ 18 ఏళ్ల వయస్సు ఉన్న కుర్రాడు ఎన్నికల్లో పోటీ చేస్తే అతని నమ్మి ఓటు వేసే జనాలు కూడా ఎవరూ ఉండరు అని చెప్పాలి. అందుకే 18 ఏళ్ల వయస్సు ఉన్న ఓటు వేయడానికి ఆసక్తి చూపుతారు తప్ప ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా సాహసం చేయరు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 18 ఏళ్ల వయస్సు ఉన్న కుర్రాడు చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికలలో ఏకంగా ప్రత్యర్థిని ఓడించి 18 ఏళ్ల వయసుకే ఒక నగరానికి మేయర్గా ఎన్నికయ్యాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 యూఎస్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు జైలెన్స్ స్మిత్ ఇటీవల ఈ ఘనత సాధించాడు. అమెరికాలో ఉన్న అర్కాన్ సాస్ లోని ఎర్లే పట్టణంలో ఇటీవలే మేయర్ ఎన్నికల జరిగా ఇక ఎన్నికల్లో భాగంగా తన ప్రత్యర్థి నేమి మాథ్యూస్ ను ఓడించి మేయర్గా ఎన్నికయ్యాడు ఈ యువకుడు. అంతే కాదు మేయర్ గా ఎన్నికైన అతి పిన్న వయసుకుడిగా కూడా రికార్డు సృష్టించాడు. ప్రజా భద్రతను మెరుగుపరచడం పాడబడిన భవనాలను పునరుద్ధరించడం లాంటి అభివృద్ధి పనులు చేస్తాను అంటూ ఇచ్చిన హామీలతో చివరికి మేయర్గా ఎన్నికయ్యాడు అని చెప్పాలి. ఇంకో విషయం ఏమిటంటే ఇటీవలే మేయర్ గా ఎన్నికైన స్మిత్ ఇక ఈ ఏడాదే పట్టభద్రుడు కూడా కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: