డ్రాగన్ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్..ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్..!
అయితే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేసినట్లు తెలుస్తోంది.షెడ్యూల్ కంటే ముందుగానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కి చేరుకున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో నటించిన నటినటులకు సంబంధించి ఇప్పటివరకు చిత్ర బంధం అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్లో సీనియర్ హీరోగా పేరు సంపాదించిన అనిల్ కపూర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. అలాగే మలయాళ హీరో టామినో థామస్ విలన్ గా కనిపించబోతున్నారు.
ఈ సమయంలోనే తాజాగా ఇప్పుడు మరొక విషయం వినిపిస్తోంది. అదేమిటంటే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ ప్రాజెక్టులో బాగమయిందనే విధంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఆమె డ్రీమ్ కూడా తీరినట్టే అవుతుంది. ఎన్నో సందర్భాలలో ఆమె ఎన్టీఆర్ సినిమాలలో తాను నటించాలని కోరిక ఉందంటూ బయటపెట్టింది. ఇప్పుడు ఇందుకు సంబంధించి అవకాశం రావడంతో నటిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అటు ఖుష్బూ గానీ, చిత్ర బృందం కానీ ఏ విధమైన ప్రకటన చేస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయమైతే వైరల్ గా మారింది.