అక్కడ లాక్ డౌన్.. కరోనా వల్ల కాదు.. ఎందుకోసమంటే?

praveen
మొన్నటి వరకు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా ఎంత అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కరోనా వైరస్ విజృంభించి  కోట్ల మంది ప్రాణాలను తీసేసిన నేపథ్యంలో ప్రభుత్వాలు ఇక కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం వేరే దారి లేక అటు ఇక కఠినమైన నిబంధనలు మధ్య లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి.

 ఇక ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావం నుంచి బయటపడుతూ ఉండగా అటు కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా మాత్రం ఇంకా కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతూనే ఉంది. అక్కడ ఇంకా కొన్ని ప్రాంతాలలో కఠినమైన లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఏకంగా లాక్ డౌన్ విధించడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అదేంటి ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి కదా మళ్లీ లాక్ డౌన్ విధించడం ఏంటి కరోనా వైరస్ మళ్ళీ పెరుగుతుందా ఏంటి అని భయపడిపోతున్నారు కదా.

 ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లాక్ డౌన్ విధించిన మాట వాస్తవమే.. అయితే కరోనా వైరస్ ప్రభావం కారణంగా అయితే కాదు.. మరి దేనికోసం అని అంటారా.. ఏకంగా సింహాల కారణంగా సిడ్నీలో లాక్ డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తరొంగా జూ ఉంది. అందులో ఉన్న ఐదు సింహాలు కూడా పొరపాటున బోను నుంచి బయటకు వచ్చేసాయి. దీంతో  సిడ్ని లోని కొన్ని ప్రాంతాలతో పాటు అటు జూ లో కూడా లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇక ఆ నాలుగు సింహాలను కూడా కూడా తిరిగి ఎన్ క్లోజర్ లోకి పంపించగలిగినప్పటికీ ఓ పిల్ల సింహాన్ని కంట్రోల్ చేసేందుకు దానికి మత్తు ఇంజక్షన్ ఇవ్వాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే గతంలో సిడ్నీలోని మొగో జూ లో ఒక సింహం బయటకు రావడంతో ఇక ప్రజలకు ఉపాయం కలవకుండా దానిని కాల్చి చంపారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: