లవ్ చేసింది.. కానీ తాళిబన్లు అలా చేస్తారని.. చివరికి?

praveen
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ మారణ హోమం సృష్టించి అధికారాన్ని చేపట్టిన తాళిబన్లు ఇక ఆఫ్గనిస్తాన్ లో పాల్పడుతున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అని చెప్పాలి. ఇక తాళిబన్లు చేస్తున్న దారుణాలను ప్రశ్నించే వారి లేకుండా పోయారు. ఎవరైనా ధైర్యం చేసే ప్రశ్నిస్తే ఇక వారిని బహిరంగ ప్రదేశాల్లోనే దారుణం గా కాల్చి చంపుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ముఖ్యం గా తాళిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు మహిళల విషయం లో చూపుతున్న వివక్ష అయితే ప్రపంచాన్ని మొత్త అవాక్కయ్యేలా చేస్తుంది అని చెప్పాలి.

 ఇప్పటికే ఎంతో మంది అమ్మాయిలను మహిళలను కూడా ఉద్యోగాలు మానిపించి  వంటింటికి మాత్రమే పరిమితం చేసిన తాళిబన్లు ఒకవేళ అమ్మాయిలు ఏదైనా తప్పు చేస్తే అత్యంత పాశవీకం గా బహిరంగం గానే రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలు విధిస్తున్నారు. ఈ క్రమం లోనే ఇటీవలే ఓ మహిళ తాళిబన్ల అరాచకాలకు భయపడి చివరికి బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఆఫ్గనిస్తాన్లోని ఘోర్ ప్రావిన్స్ లో ఓ మహిళ ప్రేమించిన వ్యక్తితో నుంచి ఇంట్లో నుంచి పారి పోయింది.

 ఈ క్రమం లోనే తాళిబన్లు వీరిద్దరిని పట్టుకున్నారు.ఆ తర్వాత ఇక ఇలా యువతి తో పారి పోయిన వ్యక్తిని అక్టోబర్ 13వ తేదీన ఉరి తీసారు. అంతేకాదు ఇక తమ చట్టాలకు విరుద్ధం గా తప్పు చేసిన మహిళను బహిరంగం గా అందరి ముందే రాళ్లతో కొట్టి చంపాలి అని భావించారు. అయితే తాళిబన్ల చేతి లో ఎంతో భయంకరమైన చావు చూడటం కంటే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం మంచిది అని భావించింది మహిళా. ఈ క్రమం లోనే ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కాస్త సంచలనం గా మారి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: