
సైకో నర్సు.. అప్పుడే పుట్టిన శిశువులను దారుణంగా?
ఇక్కడ వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రాణాలు కాపాడాల్సిన నర్సు ఏకంగా అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు తీసిన ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా చిన్నపిల్లలను చూసినప్పుడు ప్రతి ఒక్కరికి మనసు పులకరించి పోతుంది అనే చెప్పాలి. ఒక్కసారి చిన్న పిల్లలను చేతుల్లోకి తీసుకుంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అయితే అలాంటి చిన్నపిల్లలను ఎంతో కేరింగ్ గా చూసుకోవలసిన నర్సు చివరికి దారుణంగా హింసించి వారి ప్రాణాలు పోవడానికి కారణమైంది అని చెప్పాలి.
అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది మన దేశంలో కాదు యూకే లో వెలుగు చూసి సంచలనంగా మారిపోయింది. కౌంటెస్ ఆఫ్ చస్టర్స్ హాస్పిటల్లో నర్సుగా పని చేస్తుంది లూసీ లెడ్పీ అనే మహిళ. ఇక కర్కషత్వానికి మారుపేరుగా మారిపోయింది ఈ నర్సు. ఆ హాస్పిటల్లోజన్మించిన శిశువులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ముక్కు ట్యూబ్ ద్వారా కడుపులోకి గాలిని ఇంజెక్ట్ చేసి ఏడుగురు శిశువులను హత్య చేసింది. వారితో పాటు మరో పదిమందిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి అని యూకే కోర్టు తెలిపింది. అభం శుభం తెలియని శిశువులను హత్య చేసిన నర్సు ఆ తర్వాత ఆ కుటుంబాలకు సానుభూతి తెలియజేయడం గమనార్హం.