ప్రేమంటే ఇదే.. చనిపోయిన భార్య కోసం.. 11ఏళ్లుగా సముద్రంలోనే?

praveen
దాంపత్య బంధానికి కనీస విలువ ఇవ్వని రోజులు నేటి రోజుల్లో కనిపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అది ప్రేమ వివాహమైన.. పెద్దలు కుదిరిచిన వివాహమైన సరే చిన్నచిన్న కారణాలతోనే చివరికి భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇలా నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలిచి.. తుది శ్వాస వరకు అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు.. పెళ్లయిన కొన్నాళ్ళకి చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నారు. చివరికి కోర్టు మెట్లు ఎక్కి విడాకులు కావాలి బాబోయ్ అంటూ తెగ వాదిస్తున్నారు అని చెప్పాలి.

 అంతేకాదు పొరపాటున భార్య చనిపోయింది అంటే చాలు ఇక రోజులు కూడా గడవకముందే రెండో వివాహం చేసుకొని మొదటి భార్య గురించి మొత్తం మరిచిపోతున్న ఘటనలు కూడా నాటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయ్. ఇలాంటి రోజుల్లో ఒక వ్యక్తి మాత్రం చనిపోయిన భార్య కోసం 11 ఏళ్లుగా వెతుకులాట చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ విషయం తెలిసిన ఎంతో మంది నెటిజన్లు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అనుబంధం అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. 2011లో జపాన్ లో వచ్చిన సునామీ కారణంగా ఎంతలా ప్రాణ నష్టం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సునామి సమయంలోనే జపాన్ కు చెందిన 65 ఏళ్ల ఎసునో అనే వ్యక్తి తన భార్యను కోల్పోయాడు. అయితే సునామి కారణంగా కనీసం భార్య మృతదేహం కూడా అతనికి దొరకలేదు అని చెప్పాలి. దీంతో ఆ రోజు నుంచి ఈరోజు వరకు అతను భార్య మృతదేహాన్ని కనుగొనే పనిలో పడిపోయాడు. వారంలో ఒకరోజు ఇక సముద్రంలో తన భారీ మృతదేహం లభిస్తుందేమో అని ఆశతో వెతుకులాట చేస్తున్నాడు. ఇందుకోసం 2013లో సముద్రంలో దిగేందుకు డైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: