వామ్మో.. ఉబెర్ లో ఒక్క రైడ్ కి.. 32 లక్షలు?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ఇక ఏది కావాలన్నా మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో దొరుకుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడికైనా వెళ్లాలి అంటే అటు ప్రయాణాలు కూడా ఎంతో సులభతరం చేసేందుకు ఎన్నో రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.  ఒకప్పుడు కారులో తిరగాలి అనుకుంటే కారు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఉబర్, ఓలా సహా మరికొన్ని రకాల క్యాబ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే  నగరాల్లో ఉండే జనాలు ఎక్కువగా ఇలాంటి సర్వీసుల మీద ఆధారపడుతున్నారు.

 ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే ఆన్లైన్లో గమ్యస్థానాన్ని  మార్క్ చేసి క్యాబ్ బుక్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. తద్వారా నిమిషాల వ్యవధిలోనే కారు మన ముందుకు వచ్చి వాలిపోతూ ఉంది. ఇక ఎంతో సాఫీగా కారులో కూర్చొని ప్రయాణాలు చేస్తూ ఉన్నారూ నేటి రోజుల్లో జనాలు. అయితే ఇలాంటి సర్వీసుల్లో కూడా పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో.. అతి తక్కువ ధరలకే నేటి రోజుల్లో ఎన్నో కంపెనీలు ఇలాంటి ట్రావెలింగ్ సర్వీస్ లను అందిస్తున్నాయ్ అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక కస్టమర్ కు మాత్రం ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురయింది.

 ఉబర్ కార్లో ఒక రైడ్ వెళ్ళినందుకుగాను ఏకంగా 32 లక్షల రూపాయలు చార్జ్ చేసారు. ఇది మన దేశంలో కాదులేండి ఇంగ్లాండ్లో జరిగింది. ఓలివర్ కల్పన్ అనే వ్యక్తి నాలుగు మైళ్ళ జర్నీ కోసం ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు.. ఇక 15 నిమిషాల్లో తన గమ్యస్థానానికి చేరుకున్నాడు. అయితే ఇక ఈ నాలుగు మైళ్ళ రైడ్ కోసం ఉబర్ 32 లక్షల ఛార్జ్ చేస్తున్నట్లు మెసేజ్ రావడంతో కంగుతున్నాడు. ఇక వెంటనే కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి నిలదీశాడు. ఇంత మొత్తం ఎలా వచ్చింది అంటూ అడిగాడు. కస్టమర్ కేర్ వాళ్లు తప్పును గుర్తించారు. అతను ఇంగ్లాండ్ లోని విచ్ వుడ్ కాకుండా ఆస్ట్రేలియాలోని విచ్ వుడ్ అనే ప్రాంతాన్ని గమనిస్తానంగా పెట్టుకోవడంతో ఇలా జరిగినట్లు కస్టమర్ కేర్ ప్రతినిధులు  తెలపడంతో ఊపిరి పీల్చుకున్నాడు సదరు కస్టమర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: