అమ్మ ఇచ్చిన సలహాతో.. కోట్లు సంపాదించింది?

praveen
అదృష్టం కలిసి రావాలి కానీ వద్దు వద్దు అన్న కూడా లక్ష్మీదేవి తలుపు తడుతుంది అని అంటుంటారు పెద్దలు  కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇలాంటిది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది డబ్బు సంపాదించాలని ధనవంతులు కావాలి అంటూ నిద్రాహారాలు మానేసి ఎంతో కష్ట పడటం లాంటివి చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నింట్లో కూడా ప్రయత్నాలు చేయడం మొదలు పెడుతూ ఉంటారు. కానీ కొంతమంది విషయంలో ఏళ్లు గడుస్తున్నా ధనవంతులం కావాలనే కోరిక మాత్రం తీరదు అని చెప్పాలి.

 అయితే కొంతమందికి మాత్రం ఏం కష్టపడకుండానే అదృష్టం తలుపు తడుతూ వుంటుంది. దీంతో ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారిపోవడం జరుగుతుంది. ఇలా ఇటీవలి కాలంలో ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారిపోయాడు అంటే అది కేవలం లాటరీ ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెబుతూ ఉంటారు ఎంతోమంది. కానీ ఇక్కడ మాత్రం ఒక మహిళా సరదాగా గేమ్ ఆడటం కారణంగా ఓవర్నైట్ కోటీశ్వరురాలిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఒకసారి వివరాల్లోకి వెళితే.. అమ్మ చెప్పిన చిన్న సలహా పాటించి ఓ మహిళకోట్ల రూపాయలకు అధిపతి గా మారిపోయింది. అదిరిపోయే జాక్పాట్ సొంతం చేసుకుంది. కరోలినా కు చెందిన గినాది లార్డ్ తల్లితో కలిసి కిరణా షాప్ కి వెళ్ళింది. ఈ క్రమంలోనే సరదాగా పాస్ట్ ప్లే గేమ్ ఆడమని సదరు మహిళకు సూచించింది ఆమె తల్లి. ఇక అయిదు డాలర్లతో టికెట్ కొనుక్కొని ఆ గేమ్ ఆడింది సదరు మహిళ. చివరికి 2.54 లక్షల డాలర్లు అందులో గెలుచుకుంది.  ఇక మన కరెన్సీలో దీని విలువ రెండు కోట్లకు పైగానే ఉంటుంది అని చెప్పాలి. ఇలా తల్లి ఇచ్చిన సలహాతో కోటీశ్వరురాలి గా మారిపోయింది సదరు మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: