నాసా శాస్త్రవేత్తలకు వింత సెంటిమెంట్.. పల్లీలు తింటారట?

praveen
ఇటీవల కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ కొన్ని రకాల సెంటిమెంట్ నమ్ముతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాము ఏ పని చేసినా కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ పని మొదలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంది ఫాలో అయ్యే సెంటిమెంట్లను అటు శాస్త్రవేత్తలు మాత్రం ట్రాష్ అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది శాస్త్రవేత్తలు అయితే దేవుడు లేడు దయ్యం లేదు అంటూ బల్ల గుద్ది మరీ చెబుతూ ఉంటారు. మరి కొంతమంది అటు శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నప్పటికీ సెంటిమెంట్లను మాత్రం బాగా ఫాలో అవుతూ ఉంటారు అని అప్పుడప్పుడూ తెరమీదికి వస్తూ ఉంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అటు ఏరోస్పేస్ విభాగంలో పనిచేసే శాస్త్రవేత్తలకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయట. మన ఎక్కువగా సినిమాల్లో.. నిజజీవితంలో కూడా చూస్తూ ఉంటాము. క్రికెట్ మ్యాచ్ వస్తున్న సమయంలోఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చున్నప్పుడు బ్యాట్స్మెన్ సిక్సర్ లేదా ఫోర్ కొట్టి నప్పుడు.. ఇక ఆ వ్యక్తి మ్యాచ్ పూర్తయ్యేంత వరకూ అక్కడే కదలకుండా కూర్చుంటాడు. అలా ఒక సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. ఇక శాస్త్రవేత్తలు కూడా ఏదైనా ప్రారంభించినప్పుడు ఇక ఆ పని సక్సెస్ అయితే  అంతకుముందు చేసిన పనినే సెంటిమెంట్ గా ఫాలో అవుతూ ఉంటారూ. ఇక్కడ ఏకంగా  నాసా శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి సెంటిమెంటు ఎన్నో ఏళ్ల నుంచి ఫాలో అవుతూ వస్తున్నారట.

 ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసా.. వేరు శనగలు తినడం.. ఏంటి ఆశ్చర్య పోతున్నారు కదా కానీ ఇది నిజమే.  టెక్నోలజీ  పెరిగిపోతున్న నేటి రోజుల్లో కూడా సైంటిస్టులు సెంటిమెంట్లను పాటిస్తూ ఉంటారు. అయితే నాసా లో ఏదైనా మెషిన్ ప్రారంభించేముందు అక్కడ శాస్త్రవేత్తలందరూ కూడా వేరు శనగ పల్లీలు తింటూ ఉంటారట. ఎందుకంటే 1960లో రేంజర్ సెవెన్ అనే ప్రయోగం చేపట్టింది నాసా. ఇది ఆరు సార్లు ఫెయిల్ అయింది. ఏడోసారి ప్రయోగం చేపట్టగా ఓ సైంటిస్టు వచ్చి పల్లీలు తింటే టెన్షన్ తగ్గుతుందని అందరికీ ఇచ్చాడట. అందరూ పల్లీలు తింటున్న  సమయంలో ఆ ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో అదే సెంటిమెంట్ గా మారిపోయింది. అప్పటినుంచి ఏ మిషన్ ప్రారంభించిన ఇలా పల్లీలు తినడం సెంటిమెంట్ గా పెట్టుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: