ఇక్కడ విచిత్రం.. అబ్బాయికి పీరియడ్స్.. డాక్టర్లు షాక్?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం ప్రపంచం నలుమూలల్లో ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని రకాల విషయాలను.. వార్తలను తెలుసుకుంటూ మనిషి ప్రపంచాన్ని మొత్తం స్మార్ట్ ఫోన్ లోనే చుట్టేస్తున్నాడు అనే చెప్పాలి. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఎన్నో వార్తలు ఎంతోమందిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. మరి కొన్ని వార్తలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

 సాధారణంగా అయితే ఆడవారు మగవారిని పెళ్లి చేసుకోవడం హాయిగా సంసారం చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉండటం ప్రకృతిలో సహజమైనది. కానీ ఇటీవలి కాలంలో మగవారు మగవారీని పెళ్లి చేసుకోవడం ఆడవారు ఆడవారిని మనువాడటం లాంటివి జరుగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయ్. ఇక్కడ జరిగిన ఘటన అయితే అంతకు మించి అనే రేంజ్లో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎవరిని ఎవరు పెళ్లి చేసుకున్న అటు ప్రతినెల పీరియడ్స్ మాత్రం కేవలం ఆడవారికి మాత్రమే జరుగుతుంది అన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.

 ఇలా పీరియడ్స్  కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఆడవారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక అబ్బాయికి పీరియడ్స్ వస్తూ ఉండడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. చైనాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతనికి మూత్రంలో రక్తం పడటం ఇక పొత్తికడుపులో నొప్పి వస్తుండటంతో స్కానింగ్ చేయించుకున్నాడు. దీంతో స్కానింగ్ రిపోర్టులో బయట పడ్డ విషయం చూసి డాక్టర్లు సైతం అవాక్కయ్యారు. గర్భాశయం అండాశయాలుతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు అతనిలో ఉన్నట్లు బయటపడింది. ఋతుక్రమం వల్ల మూత్రంలో రక్తం వస్తుందని డాక్టర్లు నిర్ధారించారు. 20 ఏళ్లుగా ఇలా జరుగుతున్నా అతను గుర్తించలేదు.  చివరికి ఇటీవల స్కానింగ్లో బయటపడటంతో ఆపరేషన్ చేయించుకుని వాటిని తొలగించుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: