చైనా గాడిదల దొంగతనం.. అయ్యో ఇదెక్కడి విడ్డూరం?

praveen
చైనా చేసే అరాచకాలు ఎప్పుడూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అన్ని దేశాలు అభివృద్ధి సాధించడం కోసం సరైన దారిలో వెళుతూ ఉంటే.. చైనా మాత్రం ఎప్పుడూ దొడ్డి దారులు వెతుకుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకం అనే ఒక సామెత ఉంది కదా..  చైనా వ్యవహరించే తీరు కొన్ని కొన్ని సార్లు ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తమ దేశానికి ఉపయోగపడుతుంది అని తెలిస్తే ఇతర దేశాల నుంచి చోరీ చేయడానికి కూడా చైనా వెనకడుగు వేయరు అనే చెప్పాలి.

 ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న అన్ని దేశాలతో వివిధ భూభాగాల విషయంలో వివాదాలు పెట్టుకుంది చైనా. కనిపించిన భూభాగం మొత్తం తమదే అంటూ ఆరోపిస్తూ ఎప్పుడు విమర్శలు ఎదుర్కొంటుంది చైనా. చైనా చేస్తున్న ఒక దొంగ పని ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. అమెరికా తర్వాత అతిపెద్ద  ఆర్థిక శక్తిగా రెండవ స్థానంలో కొనసాగుతున్న చైనా ఏకంగా గాడిదల దొంగతనం చేస్తుందట. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. చైనా ఏంటి గాడిదల దొంగతనం ఏంటి.. విడ్డూరంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.

 చైనాలో తయారు చేసే ఒక సాంప్రదాయమైన మందు కోసం  ఇలాంటి అరాచకానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పేద దేశాలైన మాలి, జింబాబ్వే,  టాంజానియాలో నుంచి చైనా గాడిదలను అక్రమంగా ఎత్తుకు వెళ్తుందట. గాడిదల చర్మం నుంచి తయారు చేసే ఏజీయావో అనే సంప్రదాయ మందు కోసం ఇలాంటి నీచానికి పాల్పడుతుంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ టానిక్ వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుందని చైనీయులు నమ్ముతూ ఉంటారట.  ఇక ఈ మందు తయారీ కోసం తమ దేశంలో తగినన్ని గాడిదలు లేకపోవడంతో ఇక ఆఫ్రికా దేశాల నుంచి ఇలా గాడిదల దొంగతనం చేసినట్లు యూకే యూఎస్ఏ కి సంబంధించిన మీడియాలో కథనాలు రావడంతో ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో  ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: