పాకిస్తాన్ కి షాక్ ఇచ్చిన రష్యా.. ఏం చేసిందంటే?
ఇక భారత్ లో పెట్రోల్ ధర సెంచరీ కొడితేనే సామాన్య ప్రజలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. కానీ పాకిస్థాన్ లో మాత్రం దాదాపు 250 రూపాయలకు పైగానే లీటర్ పెట్రోల్ ధర పలుకుతుంది. కేవలం ఒక పెట్రోల్ మాత్రమే కాదు అన్ని రకాల నిత్యావసరాల ధరలు కూడా ఊహించని రీతిలో పెరిగిపోయాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు ఇతర దేశాల నుంచి తక్కువ ధరకే ఇంధనం కొనుగోలు చేసేందుకు అటు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఇటీవల పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన షాబాజ్ షరీఫ్.. ఇటీవలే రష్యా దగ్గర నుంచి ఇంధన నిల్వలు తక్కువగా డిస్కౌంట్ తో అమ్మాలని విన్నపంచేశారు..
కానీ అటు రష్యా మాత్రం పాకిస్తాన్ కి ఊహించని షాక్ ఇచ్చింది అన్నది తెలుస్తుంది. మిత్ర దేశమైన భారత్ కి అటు రష్యా 30 శాతం డిస్కౌంట్ తో ఇంధన నిలువలను పంపిణీ చేస్తుంది. తద్వారా భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే రీతిలో ఇక తమ దేశానికి కూడా తక్కువ డిస్కౌంట్ తో ఇంధనం పంపిణీ చేయాలి అంటూ రష్యాకు పాకిస్థాన్ విన్నవించగా ఇలా తక్కువ ధరలకు పాకిస్థాన్కు ఇంధనాన్ని ఇవ్వలేము అంటూ రష్యా తేల్చి చెప్పేసింది. దీంతో పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలింది.