అయ్యో పాపం.. ఇరాక్ లో కూడా అదే సంక్షోభం?

praveen
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు తీవ్ర స్థాయిలో గోధుమల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అన్న విషయం తెలిసిందే. చైనా సహా మరికొన్ని దేశాలు కూడా గోధుమలు సంక్షోభం  ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు తీవ్రంగానే శ్రమిస్తూ ఉన్నాయి. అయితే అటు ఇరాక్ లో కూడా ఇలాంటి గోధుమ సంక్షోభం ఏర్పడిందని తెలుస్తున్నది. అయితే ఇలా అన్ని దేశాలలో సంక్షోభం ఏర్పడటానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగిన జరిగిన యుద్ధమే అన్నది తెలుస్తుంది. ఉక్రెయిన్ రష్యా మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా ఒక్కసారిగా అంతర్జాతీయ సప్లై చైన్ తెగిపోయినట్లు అయింది.

 దీంతో చాలా దేశాలు వివిధ రకాల సంక్షోభం ఎదుర్కొంటున్నాయ్. ఇందులో భాగంగానే ఎక్కువ దేశాలు మాత్రం గోధుమల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది.  ఇరాక్ లో గోధుమ సంక్షోభం రావడానికి కేవలం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే కాదు ఇక ప్రకృతి వైపరీత్యం కారణం కూడా కారణమట. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా అక్కడ పంటలు సరిగా పని పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతులకు రాయితీలు రాకపోవడం వల్ల కూడా ఎంతో మంది రైతులు ఇక గోధుమ పంట వేసేందుకు ముందుకు రాలేదట.

 అంతేకాదు ఇక ఇరాక్ లో ఉన్నటువంటి నదులలో జలప్రవాహం తగ్గిపోవడం.. ఇరాక్ పైన ఉన్నటువంటి టర్కీ, సిరియా దేశాలు భారీ వంతెనలు కట్టడం కారణంగా ఇరాక్ కి సరిపడా నీరు అందకపోవడం కారణంగానే ఇలాంటి సంక్షోభం ఏర్పడింది అన్నది తెలుస్తుంది. మొత్తంగా ప్రతి ఏడాది 6.2 మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి చేస్తుంటుంది ఇరాక్. అవసరాలకు పెట్టుకొని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం 2.5 మిలియన్ టన్నుల గోధుమలు మాత్రమే ఉత్పత్తి చేసిందట. కాని ప్రస్తుతం ఇరాక్ లో 6 మిలియన్ టన్నుల గోధుమలు అవసరమయ్యాయ్. దీంతో తీవ్రమైన సంక్షోభంలో ఇబ్బంది పడుతుంది ఇరాక్. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: