ఉద్యోగులకు కొత్త రూల్.. స్క్రీన్ షాట్ పంపించాకే ఇంటికి?

praveen
ఇటీవలి కాలంలో కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల విషయంలో చిత్రవిచిత్రమైన రూల్స్ తెరమీదకి తెస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఉద్యోగులు సక్రమంగా పని చేస్తున్నారా లేదా అన్న విషయాలను తెలుసుకునేందుకు ఇక సరికొత్త నిబంధనలను తీసుకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగులు పని చేయడానికి బదులు ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడకం లో నిమగ్న పోతూ ఉంటారు.. ఇక పనిచేసే దగ్గర సీసీ కెమెరాల నిఘా ఉంటుంది కాబట్టి ఇక బాత్ రూమ్ కి వెళ్ళి  ఎక్కువ సమయం పాటు  మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక ఇలాంటి సమస్యలను దాదాపు అన్ని కంపెనీలు కూడా ఎదుర్కొంటున్నాయని చెప్పాలి.

 ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు ఉద్యోగుల పనితీరు పై నిఘా పెట్టేందుకు ఆయా కంపెనీలు కొత్త రూల్స్ తీసుకు వస్తున్నాయ్. ఈ క్రమంలోనే చైనాలోని కంపెనీలు కూడా ఒక విచిత్రమైన రూల్స్ తీసుకురావాలని నిర్ణయించింది. టాయిలెట్ లో ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారు అన్న అనుమానం వచ్చినా కంపెనీ యాజమాన్యాలు సరి కొత్త నిబంధన తెరమీదకు తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరు ఇక ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో స్క్రీన్ షాట్ పంపించాల్సిందే అంటూ రూల్స్ తెర మీదికి తీసుకువచ్చాయి. అదేంటి ఉద్యోగులు సరిగ్గా పని చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి మొబైల్ స్క్రీన్ షాట్ కి సంబంధం ఏముంది అని అనుకుంటున్నారు కదా.

 అదేంటంటే ఉద్యోగుల టాయిలెట్ లో ఎక్కువ సేపు ఉంటున్నారని ఆ సంస్థ టైమర్ ను ఏర్పాటు చేసింది. ఊహన్ లోని ఒక కంపెనీ ఉద్యోగులు తమ సెల్ ఫోన్ లో స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత ఇంటికి వెళ్లాలి అంటూ నిబంధనలు పెట్టింది. ఎందుకంటే మొబైల్ లో చార్జింగ్ ను బట్టి డ్యూటీ టైం లో ఎంత సేపు ఫోన్ వాడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అనే ప్లాన్ వేసింది. ఇక ఇలాంటి రూల్ కారణంగా ఉద్యోగులందరూ కూడా తక్కువగా మొబైల్ వాడే విధంగా చేయొచ్చని సదరు కంపెనీ నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసి ఇలాంటి రూల్ మన దగ్గర రాకపోతేనే బెటర్ అని అనుకుంటున్నారు చాలా మంది ఉద్యోగులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: