రసాయన దాడి తప్పదు.. బైడెన్ షాకింగ్ కామెంట్స్?

praveen
అగ్ర దేశమైన రష్యా చిన్న దేశమైన ఉక్రెయిన్ పై ఆధిపత్యం కోసం ఏకంగా ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే మొదట కేవలం సైనిక స్థానాలను మాత్రమే టార్గెట్ చేసుకునీ దాడులకు పాల్పడిన రష్యా ఇక ఆ తర్వాత మాత్రం ఏకంగా జనావాసాల పై కూడా బాంబుల వర్షం కురిపించడంతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ఉక్రెయిన్ అటు రష్యాతో పోరాడేందుకు సిద్ధమైంది. అయితే అప్పటి వరకూ అండగా ఉంటామని ఆయుధ సహకారం అందిస్తాము అంటూ చెప్పిన నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు ఎక్కడా సహకారం అందించకుండా పక్కకు తప్పుకున్నాయ్.  దీంతో అగ్ర దేశమైన రష్యాతో చిన్న దేశమైన ఉక్రెయిన్ ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 అయితే అటు ఆయుధ సహకారం అందించడం లేదు కానీ పాశ్చాత్య దేశాలు మొత్తం రష్యాపై ఆర్థిక యుద్ధాన్ని చేస్తున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే రష్యాలో ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగి పోయి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అక్కడి ప్రజలు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే విషయం పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్ నుంచి ఈ స్థాయి ప్రతిఘటన.. ఇక పశ్చిమ దేశాల నుంచి ఇంతటి కఠిన ఆంక్షలను పుతిన్  అసలు ఊహించలేదని బైడెన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 కానీ ఎలాగోలా పైచేయి సాధించాలని అనుకుంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్న రోజుల్లో దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశముందని అంచనా వేశాడు.  ఈ క్రమంలోనే రసాయన ఆయుధాల ప్రయోగానికి దిగే ఆలోచనలో కూడా ఉన్నారని మరోసారి ఆరోపించడం గమనార్హం. అంతేకాదు ఇక ఉక్రెయిన్ కి మద్దతుగా ప్రస్తుతం అమెరికా రష్యా పై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో దీనికి ప్రతీకారంగా అమెరికాపై రష్యా సైబర్ దాడులకు దిగే అవకాశం కూడా ఉందని ఆరోపించారు. ఇక ఇదే విషయంపై స్పందించిన రష్యా బైడెన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అలాంటివి అమెరికా పశ్చిమ దేశాలకు మాత్రమే అలవాటు అని ఎద్దేవా చేసింది. ఇక అమెరికాతో సంబంధాలు కుప్పకూలే దశలో ఉన్నాయంటూ ఆ దేశ రాయబారిని పిలిచి నిరసన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: