ఉక్రెయిన్ దెబ్బకు.. ఎంతమంది రష్య సైనికులు చనిపోయారో తెలుసా?
ఇక బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం మొదలుపెట్టడంతో ప్రస్తుతం ఉక్రెయిన్ లో మారణహోమం జరుగుతుంది అని చెప్పాలి. అయితే రష్యా యుద్ధం మొదలు పెట్టిన నేపథ్యంలో ఉక్రెయిన్ రెండు మూడు రోజుల్లో యుద్ధం చేయలేక లొంగిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ యుద్ధం మొదలై రెండు వారాల గడిచిపోతున్నాయి. ఇంకా ఉక్రెయిన్ సైనికులు మాత్రం ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఎంతో మంది రష్యన్ సైనికులను హత మారుస్తున్నారు.
ఇక ఇప్పటి వరకూ సైనికులు 14710 రష్యా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది ఉక్రెయిన్ రక్షణశాఖ. దీంతో పాటు 476 యుద్ధ ట్యాంకులు 1487 సాయుధ వాహనాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇక 96 యుద్ధవిమానాలు 118 హెలికాప్టర్లు 21 యూ ఏ వీలు ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇక మొత్తంగా మూడు యుద్ధనౌకలు 44 యుద్ధ విమాన క్షిపణి విధ్వంసక వ్యవస్థను నాశనం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.అయితే యుద్ధం లో ఎంత మంది రష్యన్ సైనికులు మట్టుబెట్టాము అన్న విషయాన్ని ప్రకటిస్తూన్న ఉక్రెయిన్ తమకు ఎంత నష్టం కలిగింది అన్నది మాత్రం ఇప్పటివరకు బయటపెట్టకుండా రహస్యంగానే ఉంచడం గమనార్హం.