బాబోయ్.. ఈఫిల్ టవర్ ఎత్తు పెరిగింది?

praveen
ప్రపంచంలో ఉన్న సందర్శక ప్రదేశాలలో ఈఫిల్ టవర్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఫ్రాన్స్ రాజధాని అయిన పారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ ను చూడటానికి ప్రతి ఏటా లక్షలాది మంది తరలి వస్తూ ఉంటారు. ఇక ప్రపంచం నలుమూలల నుంచి ఇక ఈ అద్భుతమైన టవర్ చూడటానికి పర్యాటకులు విచ్చేస్తుంటారు. అంతేకాదు ఇక ఈఫిల్ టవర్ వద్ద ఎన్నో సినిమా షూటింగులు కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈఫిల్ టవర్ ఎత్తు ఏకంగా 324 మీటర్ల వరకు ఉంటుంది. లిఫ్ట్ సాయంతో ఇక ఈఫిల్ టవర్ లో పైభాగం వరకు వెళ్తూ ఉంటారు పర్యాటకులు. ఇక జీవితంలో ఒక్కసారైనా సరే ఈఫీల్ టవర్ చూడాలని ఎంతో మంది ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్రాన్స్ లో ఉన్న ఈఫిల్ టవర్ కు సంబంధించిన ఒక వార్త కాస్త వైరల్ గా మారిపోయి అందరి చూపులు ఆకర్షిస్తోంది. ఇక ప్రస్తుతం మనందరికీ తెలిసిన ఈఫిల్ టవర్ ఎత్తు ఇక ఇప్పుడు మరింత పెరిగింది అనేది తెలుస్తుంది. అదేంటి అదేమైనా జీవం ఉన్నదా వాటంతట అదే పెరగడానికి అని అనుకుంటున్నారు కదా.. నిజంగానే మీరు అనుకున్నట్లు ఈఫిల్ టవర్ ఎత్తు దానంతట అదే పెరగలేదు అక్కడి అధికారులు ఈఫిల్ టవర్ ఎత్తు పెరగడానికి కారణం అయ్యారు.  ఏకంగా ఆరు మీటర్ల పొడవు వరకు ఈఫిల్ టవర్ ఎత్తు పెరిగింది అనేది తెలుస్తుంది.


 ఇంతకీ ఏం జరిగింది అంటే.. పారిస్ లో ఉన్న అధికారులు ఏకంగా ఆరు మీటర్ల పొడవు ఉన్న ఒక రేడియో యంటేనా ను హెలికాప్టర్ సాయంతో ఈఫిల్ టవర్ అగ్రభాగాన అమర్చారు అన్నది తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లకు చేరుకుంది. అయితే ఈఫిల్ టవర్ అగ్రభాగాన యంటేనా మార్చడంతో అనేక రకాల రేడియో టెలివిజన్ ట్రాన్స్మిటర్లు దానికి అమర్చారు. అయితే చాలా కాలంగా ఇది బుల్లితెర రేడియో ప్రసారాల కు ఉపకరిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇలా ఈఫిల్ టవర్ ఎత్తు పెరిగింది అన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: