అప్పటివరకు యుద్ధం తప్పదు.. పుతిన్ వార్నింగ్?

praveen
పక్కా ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ పై రష్యా మొదలెట్టిన మిలటరీ  ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన 10 రోజులు గడుస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇంకా మార్పు రాలేదు. రష్యా సేనలు ఎక్కడ వెనకడుగు వేయకుండా భీకర రీతిలో ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటికే ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగగా.. ఆ చర్చలు విఫలమయ్యాయి.

 అయితే ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించగా.. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం దీనికి సిద్ధంగా లేరు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమకు ఇతర దేశాల నుంచి సహకారం కావాలి అంటూ పదేపదే ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాడు. అండగా ఉంటాం అంటూ చెప్పిన నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలు కేవలం రష్యా పై ఆంక్షలు తోనే సరిపెడుతున్నారు తప్పా.. ఆయుధ పరంగా ఎలాంటి సహకారం అందించడం లేదు. దీంతో అగ్రదేశం తో చిన్న దేశమైన ఉక్రెయిన్ ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే ఉక్రెయిన్ పై షెడ్యూల్ ప్రకారం మిలిటరీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు పుతిన్. ఉక్రెయిన్ పోరాటం ఆపి లొంగిపోయే వరకు తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఆపే ప్రసక్తి లేదు అంటూ పుతిన్ హెచ్చరించాడు. ఇక మూడో దఫా జరిగే శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించడం ఎంతో మంచిది అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడికి  పుతిన్ సూచించడం గమనార్హం. ఈ క్రమంలోనే పుతిన్ తగ్గేది లేదు అన్నట్లుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: