కరోనా అలా పుట్టింది.. అధ్యయనంలో షాకింగ్ నిజం?
అయితే కరోనా వైరస్ గురించి చైనా అసలు నిజాలు దాచి పెట్టడమే ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి సంక్షోభం ఏర్పడటానికి కారణం అన్నది అందరికీ తెలుసు. అయితే కరోనా వైరస్ మూలాలు ఎక్కడ ఉన్నాయి ఎలా కరోనా వైరస్ పుట్టుకొచ్చింది అన్నది మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని ప్రశ్న గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రపంచవినాశనానికి చైనా ప్రయోగించిన బయో వెపెన్ కరోనా వైరస్ అని అందరూ అంటుంటారు. కాగా ఇప్పటికే పలు అధ్యయనాలు జరుగగా ఒక్కో అధ్యయనంలో ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల జరిగిన అధ్యయనంలో కరోనా వైరస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అన్న విషయం చెప్పారు శాస్త్రవేత్తలు. చైనా ఊహన్ నగరం లోని హవాన్ చాపల మార్కెట్ నుంచి వైరస్ వ్యాపించిందని ఊహన్ లో ఉన్న ల్యాబ్ నుంచి కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది.. ఇక మొదటి సారి కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు 2019లో నవంబర్ లేదా డిసెంబర్ లో వ్యాపించినట్లు ఇక ఈ అధ్యయన నివేదిక చెబుతోంది. ఇక ఆ తర్వాత కొద్ది వారాల్లోనే మార్పు చెందిన వైరస్ కేసులు నమోదయ్యాయని చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు. కానీ ఖచ్చితంగా ఏ జంతువు నుంచి మనుషులకు కరోనా వైరస్ సోకింది అన్న విషయాన్ని మాత్రం ఇక అధ్యయనాలు నిర్ధారించ లేకపోయాయ్ అని శాస్త్రవేత్తలు చెప్పారు.