షాకింగ్ : 3500 మంది సైనికులు మృతి?
ఈ క్రమంలోనే ఇటీవలే ఏకంగా 500 మంది రష్యన్ సైనికులను హతమార్చామని.. కొన్ని యుద్ధ విమానాలను హెలికాప్టర్లను కూడా ధ్వంసం చేశాము అంటూ ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఉక్రెయిన్ మరో కీలక ప్రకటన చేసింది. ఏకంగా రష్యాకు చెందిన 3500 మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అంతేకాకుండా 14 రష్యా యుద్ధ విమానాలు, 102 ట్యాంకర్లను కూడా ధ్వంసం చేశాము అంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఇక 8 హెలికాప్టర్లను 536 సాయుధ బలగాల వాహనాలను 15 ఆర్టిలరీ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసినట్లు రక్షణ విభాగం తెలిపింది.
తక్కువ బలం ఉన్నప్పటికీ రష్యా తో తమ బలగాలు ఎంతో వీరోచితంగా పోరాడుతున్నాయ్ అంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. అయితే ఈ విషయాన్ని అటు రష్యా ఇంకా ధృవీకరించకా పోవడం గమనార్హం. ఇకపోతే నిన్న మొన్నటి వరకు కేవలం సైనిక స్థావరాల మీద దాడి చేసిన రష్యా ఇక ఇప్పుడు మాత్రం జనావాసాల్లోకి కూడా దాడులు చేస్తూ ఉండటం సంచలనం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రస్తుతం భయంతో ఊగిపోతున్నారు ఉక్రెయిన్ ప్రజలు. రష్యా సైన్యం ఉక్రెయిన్లోని కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతోంది..