రష్యా యుద్ధం.. ఇండియా పై స్పేస్ స్టేషన్ కూలే ఛాన్స్?
అయితే ఉక్రెయిన్ విషయాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కాస్త మానవత్వాన్ని చూపించాలి అంటూ అటు ఐక్యరాజ్యసమితి సూచించినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఎడతెరిపి లేకుండా దాడులతో విజృంభిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు జనావాసాల్లో కూడా దాడులకు పాల్పడుతూ కీలకమైన నగరాలను హస్త గతం చేసుకుంటుంది రష్యన్ ఆర్మీ. అయితే రష్యా తో పోల్చి చూస్తే తమకు ఎక్కడ సరితూగని ఉక్రెయిన్ పై రష్యా ఆయుధాలతో విరుచుకుపడుతూ ఉండటంతో ప్రపంచ దేశాలు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి విషయం తెలిసిందే. రష్యా ఒక అప్రజాస్వామిక చర్యకు పాల్పడింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు నాటో దేశాలు కూడా ప్రస్తుతం రష్యా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్థికపరమైన ఆంక్షలతో పాటు అన్ని రకాల ఆంక్షలను కూడా విధిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ జనరల్ రోగోజిన్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. సాంకేతిక అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని అడ్డుకుంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తన కక్ష నుంచి గతి తప్పి అమెరికా ఐరోపాలో పడితే ఎవరు కాపాడుతారు అంటూ ప్రశ్నించారు ఆయన. అయితే 500 టన్నులు ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇండియా చైనా భూభాగాల పై కూలే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్పేస్ స్టేషన్ రష్యా భూభాగంపై తిరగదు కాబట్టి తమకు ఎలాంటి ప్రమాదం లేదు అంటూ చెప్పుకొచ్చారు.