రష్యా యుద్ధం.. రంగంలోకి చైనా?

praveen
మొన్నటి వరకూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న రష్యా ఉక్రెయిన్  సరిహద్దుల్లో యుద్ధం అనివార్యంగా మారిపోయింది. చిన్న దేశమైన ఉక్రెయిన్ పై అటు రష్యా ఆయుధాలతో విరుచుకుపడింది. యుద్ధ విమానాలు మిసైల్స్ ప్రయోగిస్తూ విజృంభించింది. త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ ను చుట్టుముట్టి దాడి చేసింది. రష్యా దాడితో ఉక్రెయిన్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. దాదాపు ఈ దాడిలో 300కు పైగా మృతి చెందినట్లు పాక్షికంగా నిర్ధారించారు. ఇక రష్యా ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో యుద్ధం చేయడం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇకపోతే రానున్న రోజుల్లో రష్యా ఉక్రెయిన్ విషయంలో మరింత తీవ్రంగా స్పందించి పోతున్నది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రపంచం మొత్తం రష్యా యుద్ధానికి దిగడం పై చర్చించుకుంటున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు చైనా మాత్రం ఇదే సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అని తెలుస్తోంది. రష్యా తరహాలోనే అటు చైనా కూడా పొరుగున ఉన్న తైవాన్ ను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. తైవాన్ స్వతంత్ర దేశం కాదని వన్ చైనా పాలసీలో భాగం అంటూ చైనా చెబుతోంది. అటు తైవాన్ మాత్రం చైనా చెప్పుచేతుల్లో ఉండేందుకు అస్సలు అంగీకరించడం లేదు.

 తమ సార్వభౌమాధికారాన్ని ఎవరికి దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేము అంటూ స్పష్టం చేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి తైవాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న చైనా ఇక ఇప్పుడు మరింత తెగించింది అన్నది తెలుస్తుంది. తైవాన్ జలాల్లోకి ఏకంగా చైనా యుద్ధ నౌకలను పంపించింది. తద్వారా ఒకవేళ తైవాన్ చైనా యుద్ధ నౌకలపై దాడులు చేస్తే చైనాకు రష్యా తరహాలోనే తైవాన్ పై విరుచుకుపడే ఉద్దేశంతోనే ఇలా యుద్ధ నౌకలను పంపించింది అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రష్యా ఉక్రేయిన్ యుద్ధం హాట్ టాపిక్ గా మారిపోయినా నేపథ్యంలో ఇకచైనా వ్యవహరిస్తున్న తీరు ఎక్కడ వరకు దారి తీస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: