స్వాతంత్రం కోసం పోరాటం అన్నారు.. సైన్యం రాగానే పారిపోయారు?

praveen
ఇటీవలే కెనడా లో ఊహించని రీతిలో ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడిలో భాగం గా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ తప్పని సరి చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యం గా వివిధ దేశాల నుంచి కెనడా లోకి ప్రవేశించే ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా తప్పని  సరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని ఉండాలి అంటూ కెనడా ప్రభుత్వం తెలిపింది. అయితే అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం గా మారి పోయింది అని చెప్పడం లో అతి శయోక్తి లేదు.

 వ్యాక్సిన్ వేసుకుని ప్రాణాలు కాపాడు కోవాలి అంటూ కెనడా ప్రభుత్వం చెబితే.. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందనీ అంటూ ఎంతోమంది ట్రక్ డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఉద్యమాలు బాట పట్టారు. ఈ క్రమం లోనే వేల ట్రక్కులను రహదారుల పై నిలిపి వేసి పూర్తిగా రహదారులను బ్లాక్ చేశారు. ట్రక్ డ్రైవర్లు చేసిన ఉద్యమం తీవ్రతరం కావడం తో ఏకంగా కెనడా అధ్యక్షుడు రహస్య ప్రాంతం లోకి వెళ్లి పోవాల్సినా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయం లో ట్రక్ డ్రైవర్లు కేవలం  ఒక ప్రాంతంలో మాత్రమే ఉద్యమాలు చేపట్టిన తర్వాత కాలం లో 5 ప్రాంతాలకు విస్తరించారు.
 ఈ క్రమం లోనే దేశంలో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని  భావించిన కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని రంగం  లోకి దింపింది. ఈ క్రమం లోనే ఇక సైన్యం అటు ఉద్యమకారులు అందరిని కూడా పరుగులు పెట్టించి మళ్లీ దాడి చేయడం తో ఒక్కసారిగా తమ హక్కుల గురించి ఉద్యమం చేసిన వారు ఉద్యమాన్ని వదిలి పరుగులు పెట్టారు. స్వాతంత్ర సమరయోధులం అంటూ ఉద్యమాలు చేసిన వారు  ఒక్కసారిగా సైన్యం రంగంలోకి దిగడంతో అందరూ పారిపోయిన పరిస్థితి కెనడాలో నెలకొంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: