మరోసారి చైనా చొరబాటు.. ఇక ఏం జరుగుతుందో?

praveen
భారతదేశ సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్న సమయం లో గాల్ వాన్ లోయలో చైనా సైనికులు చొర బాటు ప్రయత్నించడం ఆ సమయం లో భారత ఆర్మీ చైనా సైనికులకు అడ్డు కోవడం.. ఇక ఇరు దేశాల సైన్యం మత ఘర్షణ వాతావరణం నెల కొనడం అందరికీ తెలిసిందే. ఇలా భారత్-చైనా సరిహద్దు ల మధ్య చిన్న పాటి ఘర్షణ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయింది. అప్పటి నుంచి  సరిహద్దుల్లో తీవ్ర స్థాయి లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకానొక సమయం లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందేమో అన్న విధంగా  మారి పోయింది పరిస్థితి.

 అయితే ఇక సరిహద్దుల్లో సమస్యలను పరిష్కరించు కునేందుకు ఇరుదేశాల మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినప్పటికీ ఇక ఆ చర్చలు మాత్రం విఫలం అవుతూనే వస్తున్నాయి. చర్చల్లో వెనక్కి తాగ్గుతాము అంటూ చైనా ఒప్పుకొన్నప్పటికీ మళ్ళీ డబుల్ గేమ్ ఆడుతూ వస్తోంది. ఇలాంటి సమయం లో చైనా మాటలను నమ్మని భారత సైన్యం కఠిన పరిస్థితుల్లో సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవల మరో సారి చైనా సైన్యం సరిహద్దుల్లో తోక జాడించింది అన్నది తెలుస్తుంది.

 ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం చైనా సైన్యం మరో సారి చోర బాటుకు ప్రయత్నించింది అని తెలుస్తోంది. ఈస్ట్రన్ లడక్ దగ్గర చైనీస్ ఆర్మీ నిశ్శబ్దం గా చొరబాటు చేసేందుకు ప్రయత్నం చేస్తే.. ఇక వారిని గుర్తించిన భారత సైన్యం వారిని ఎదుర్కొని వెనక్కి తరిమి కొట్టారు అన్న టాక్ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో వైరల్ గా మారి పోయింది. ఇలాంటి సమయం  లోనే ఇక అమిత్ షా అజిత్ దోవల్ లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం భారత సైన్యం అధికారికం గా ప్రకటించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: