రష్యా ఎంతకు తెగించింది.. ప్రపంచ దేశాలకు వార్నింగ్?

praveen
రష్యా వ్యవహరిస్తున్న తీరు రోజు రోజుకీ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది. పొరుగున ఉన్న ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించడానికి ఎంతకైనా తెగిస్తా అనే విధం గానే వ్యవహరిస్తుంది రష్యా. మాకు యుద్ధం చేసే ఉద్దేశం లేదు అంటూ స్టేట్మెంట్ వహిస్తూనే సరిహద్దుల్లో ఇంత వాతా వరణాన్ని సృష్టిస్తుంది. దీంతో ఏ క్షణం లో ఏం జరుగుతుందో అన్న విధంగా మారి  పోయింది ప్రస్తుతం పరిస్థితి. అగ్రరాజ్యమైన అమెరికా నాటో దేశాలు రష్యాతో చర్చలు జరిపినప్పటికీ తగ్గేది లేదు అన్న విధం గా ఉక్రెయిన్ విషయం లో ముందుకు సాగుతుంది రష్యా.

 ఇకపోతే మొన్నటి వరకు సరిహద్దుల్లో లక్షల  మంది సైనికులను మోహరించి యుద్ధ విన్యాసాలు చేసింది. ఇలాంటి సమయం లోనే అమెరికా పలుమార్లు రష్యా తో చర్చలు జరిపింది. కానీ ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరక పోవడం తో చివరికి చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇప్పుడు మరో సరి కొత్త వ్యూహానికి రష్యా తెర లేపింది అన్నది అర్ధమవుతుంది. మొన్నటి వరకు కేవలం ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో మాత్రమే యుద్ధ విన్యాసాలు చేసింది రష్యా.

 కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ విన్యాసాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా 140 ప్రదేశాల నుంచి యుద్ధ నౌక తో విన్యాసాలు చేస్తాము అంటూ చెప్పింది. ఇక ఈ స్టేట్మెంట్ కాస్త హాట్ టాపిక్ గా మారి పోయింది. ఒకరకంగా ఉక్రెయిన్ కి మద్దతు గా నిలిస్తే యుద్ధ నౌకలతో విధ్వంసం సృష్టించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని.. ఉక్రెయిన్ విషయంలో అంత మొండి వైఖరితో ముందుకు సాగుతున్నాము అంటూ ఈ స్టేట్ మెంట్ తో వ్లాదిమిర్ పుతిన్ చెప్పకనే చెప్పాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: