హీరోల నీళ్ళల్లోకి వెళ్ళాడు.. భార్య ముందు ఫూల్ అయ్యాడు?

praveen
మంచికి పోతే ఉన్న సంచి ఊడి పోయింది అనే ఒక సామెత ఉంది. అయితే కొన్ని కొన్ని ఘటనలకు ఈ సామెత బాగా సరి పోతుంది. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఈ సామెత కు తగ్గట్లు గానే ఉంది అని చెప్పాలి. నీళ్లలో ఒక అమ్మాయి కొట్టుకు పోవటం చూసాడు. ఒక పెద్దాయన ఇక తనని తాను హీరోలాగా ఊహించు కున్నాడు. దీంతో వెంటనే నీటి లోకి దూకి ఆ అమ్మాయి ని కాపాడాలని అనుకున్నాడూ ఆయన. కానీ అంతలో అతనికి ఊహించని షాక్ తగిలింది. పోర్ట్ లాండ్ కు చెందిన క్రిస్ ఫోర్డ్ అనే రిటైర్డ్ ఫోటో గ్రాఫర్ కి ఇలాంటి అనుభవం ఎదురైందట.

 సముద్రం నుంచి కొట్టుకు వచ్చే శకలాలను సేకరించడం అతనికి ఎంతో ఇష్టం. తరచూ ఇలాంటిదే చేసేవాడు. ఈరోజు సాయంత్రం భార్యతో కలిసి సముద్రం ఒడ్డున విహరిస్తున్న సమయం లో దూరంగా తెల్లటి చేతులు నీటిపై తేలుతూ కనిపించడం గమనించాడు. అయితే ఎవరో అమ్మాయి సముద్రం లో మునిగి పోతుంది అని అనుకున్నాడు. ఇక పక్కన భార్య ఉంది అన్న విషయాన్ని మర్చి పోయి ఇక పరిగెత్తు కుంటూ వెళ్లి నీటిలోకి దూకి ప్రాణాలు కాపాడాలని అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్లి చూసేసరికి అది తలలేని సెక్స్ టాయ్ అన్నది గమనించాడు.

 అయితే హీరోలా వెళ్లి చివరికి ఒక సెక్స్ టాయ్ తో భర్త ఒడ్డుకు చేరడం తో భార్య ఎంతగానో నవ్వుకుందట. ఇక ఇలా ఈ విషయాన్ని ఇటీవలే ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఎవరో భార్య బాధితుడే ఈ పని చేసి ఉంటాడూ అని సదరు రిటైర్డ్ ఫోటో గ్రాఫర్ చమత్కరించాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అందరూ ఇది చదివి కాసేపు నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: