ఇదేం ట్విస్టు.. పాక్ కు ఝలక్ ఇచ్చిన తాలిబన్లు?

praveen
ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాదులతో ప్రపంచ దేశాల్లో ఎన్నోమార్లు మారణహోమం సృష్టించింది. ఒకవైపు ప్రపంచం మొత్తం ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ను వెలివేస్తూ ఉన్నప్పటికీ పాకిస్తాన్ తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఇప్పటికీ ఉగ్రవాదంతో అసలు సంబంధమే లేదు అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి లాగా ప్రవర్తిస్తోంది పాకిస్తాన్.  ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకే కాదు ప్రపంచ దేశాలలో ఉన్న ఉగ్రవాదులు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగింది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు ఆ ఉగ్రవాదమే అటు పాకిస్థాన్ కు సరికొత్త ఇబ్బందులను సృష్టిస్తుంది అన్నది అర్ధమవుతుంది. ప్రస్తుతం ఉగ్రవాదులకు మరో రూపమైన తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ఆయుధాలు చేపట్టి అరాచకాలు సృష్టించి ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నారు. అయితే ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రభుత్వాన్ని  బహిష్కరిస్తూన్న నేపథ్యంలో పాకిస్థాన్ మాత్రం పూర్తి స్థాయి సహాయసహకారాలు అందిస్తోంది. తాలిబాన్లకు మేలు జరిగే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.

కానీ ఇప్పుడు ఆ తాలిబన్ల నుంచి పాకిస్థాన్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాలిబన్ల లోని మరో వర్గమైన తెహరికి తాలిబన్లు పాకిస్థాన్ కు ఎంతగానో ద్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇలా పాకిస్తాన్ సైన్యానికి తాలిబన్లు వరుసగా  షాక్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవలే జురాంగ్ రేఖ దగ్గర ఏకంగా సరిహద్దు కంచేని ధ్వంసం   చేసి షాక్ ఇచ్చారు తాలిబన్లు. ఇలా నాలుగు సార్లు  పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఫెన్సింగ్ తాలిబన్లు ధ్వంసం చేశారు. ఇక ఇప్పుడు మరో సారి.. తాలిబన్లు ధ్వంసం చేసినా ఫెన్సింగ్ పునరుద్ధరించేందుకు వెళ్ళిన పాకిస్తాన్ సైనికులను ఏకంగా బట్టలు విప్పించి మరీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దీనికి సంబంధించిన దృశ్యాలను పాకిస్తాన్లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.ఇక రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: