భారత్ కు రష్యా ఆయుధాలు..ఇక చైనా, పాక్ కు వణుకేనా..?

MOHAN BABU
భారత్ పేరు వింటే శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇప్పటికే అత్యాధునిక ఆయుధ సంపత్తికేదిగిన భారత బాండాగారం లో రష్యాన్ వపెన్ S-400 చేరబోతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య  కుదిరిన ఒప్పందం కార్యరూపం దాల్చింది. మూడేళ్ల క్రితం  కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం  S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంను భారత్ కు అందించే ప్రక్రియను రష్యా ప్రారంభించింది.  అనుకున్న ప్రకారమే టైం కు డెలివరీ మొదలుపెట్టామని ప్రకటించింది. 35 వేల కోట్ల విలువైన ఐదు S-400 ఎయిర్ డిఫెన్స్ కొనుగోలు కు భారత్ రష్యా మధ్య 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం 2018 అక్టోబర్ లో కుదిరింది. అయితే దీనిపై అమెరికా తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కొంతకాలంగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. తన వైఖరిని అమెరికాకు భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ప్రాంతీయ భద్రత,రక్షణ అవసరాల రీత్యా భారత్ కు s-400  విషయంలో ఆంక్షల నుండి మినహాయింపుని ఇవ్వాలని కోరుతూ అమెరికా కీలక సెనేటర్లు,అధ్యక్షులు బైడెన్ కు లేఖ రాశారు. దీనిపై అమెరికా ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించక ముందే క్షిపణి వ్యవస్థ అందజేత ప్రక్రియ ప్రారంభమైంది. S-400 క్షిపణి వ్యవస్థకు సంబంధించి  ప్రస్తుతం భారత సైన్యానికి రష్యా ట్రైనింగ్ ఇస్తోంది. ఇప్పటికే తొలి బృందం తమ శిక్షణను పూర్తి చేసుకోగా రెండో బృందం శిక్షణ లో ఉంది.  తొలి బృందం ట్రైనింగ్ తీరుపై రష్యా కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. S-400 ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంగా చెబుతారు. బాలిస్టిక్, క్రూయీజ్ క్షిపణులను ధ్వంసం చేయగలదు. ఈ వ్యవస్థలో ని రడర్లు ఒకేసారి వందలాది లక్ష్యాలను ట్రాక్ చేయగలవు. అలాగే అమెరికా F-35 వంటి ఐదవ తరం యుద్ధ విమానాలను దీని రాడర్ తో లాక్ చేసి కూచి వేయగల సత్తా S-400 కు ఉంది. ఈ వ్యవస్థ ఒకేసారి 36 ప్రాంతాలను గురి పెట్టొచ్చు. రోడ్డు మార్గాలలో ఓ ట్రాక్కు లో కూడా అవకాశం ఉండటం కలిసి వచ్చే అంశం.400 కిలోమీటర్ల వరకు క్షిపణిని ద్వంసం చేసే సామర్ధ్యం ఉంటుంది.కేవలం మూడు S-400లు ఉంటే చాలు పాక్ సరిహద్దులన్నింటిని భారత్ ఓ కంట కనిపెట్టచ్చు అంటున్నారు డిఫెన్స్ ఎక్స్ ఫర్ట్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: