కోవిడ్ రాకతో జనల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. గత రెండు సంవత్సరాల నుండి ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయపడుతూనే బ్రతికాము . కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం మెరుగుపడి, మళ్ళీ సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నాము. కరోనా కారణంగా అన్ని రంగాలలోనూ నియమ నిబంధనలు మార్పు చెందుతున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాలు చేసే వారి విహాసయంలో ఇమ్మిగ్రేషన్ వారు రోజుకొక రూల్ లు పెడుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగచేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా వారు ప్రజల రక్షణ కోసం తీసుకునే రూల్స్ అని అందరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక దేశం నుండి మరో క దేశం వెళ్లాలంటే ఖచ్చితంగా పాస్ పోర్ట్ ఉండాలి. అది లేనిదే మిమల్ని లోపలకు అనుమతించరు.
అయితే ఇప్పుడు పాస్ పోర్ట్ లో కూడా కొన్ని మార్పులు చేసినట్లుగా సమాచారం. అయితే ఇపుడు కనీసం మన రాష్ట్రము దాటాలన్నా కూడా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి అయిపోయింది. అలాంటిది మనము దేశాన్ని దాటుతున్నామంటే ఇంకెన్ని రూల్స్ ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోండి. దీనితో ఇప్పుడు మన కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను మన పాస్ పోర్ట్ తో లింక్ చేయాలని ఒక రూల్ పెట్టింది. కానీ చాలా మందికి ఈ విషయంపైనా సరైన అవగాహన ఉండకపోవచ్చు. అందుకోసం ఈ విధానాన్ని ఇక్కడ మీకు అర్ధమయ్యే విధంగా తెలియచేస్తున్నాము.
* కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేయబడిన కోవిన్ సైట్ లోకి వెళ్ళండి. ఇందులో మీ ఫోన్ నెంబర్ ద్వారా లాగ్ ఇన్ అవ్వండి. ఆ తర్వాతా ఆ పేజ్ లో మీకు సపోర్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ప్రెస్ చేయండి.
* ఇందులో మీరు సర్టిఫికెట్ కరెక్షన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో మళ్ళీ మీకు మీరు వేసుకున్న టీకా వివరాలు కనిపిస్తాయి. అక్కడ ఉన్న రైజ్ ది ఇష్యూ అనే బటన్ పై ప్రెస్ చేయండి.
* మీకు ఖాళీలు కనిపిస్తాయి. అందులో తగిన వివరాలను పూరించండి. అప్పుడు మీ పాస్ పోర్ట్ మీ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తో లింక్ అవుతుంది.
* ఇలా మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంఫర్మ్ చేయండి. ఇప్పుడు మీ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేయండి.
ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము.