చైనా ఫోన్లు బ్యాన్ : ఎక్క‌డో తెలుసా?

Dabbeda Mohan Babu
చైనా దేశంలో త‌యారు అయ్యే వ‌స్తువుల పై చాలా మందికి న‌మ్మ‌కం ఉండ‌దు. చైనా వ‌స్తువుల మ‌న్నికా ఎక్కువ గా ఉండ‌ద‌ని చాలా భావిస్తారు. అందుకే చైనా దేశ వ‌స్తువ‌ల‌ను చాలా మంది వాడ‌టానికి ఇష్ట ప‌డ‌రు. గ‌తం లో మ‌న దేశంలో చైనా బ‌జార్ లు ఉండేవి. ప్ర‌స్తుతం వాటి సంఖ్య దాదాపు చాలా వ‌ర‌కు త‌గ్గాయి. దీనికి గ‌ల కార‌ణం చైనా వ‌స్తువ‌లు ఎక్కువ కాలం నిల‌వ‌వు అని.. వాటి మ‌న్నిక చాలా త‌క్కువ గా ఉంటుంద‌ని ప్ర‌జల భావ‌న. అలాగే మ‌న దేశ సైనికుల పై చైన వారు దాడి చేసిన‌ప్పటి నుంచి చైనా వ‌స్తువ‌ల ను నిషేధించాల‌నే డిమాండ్ కూడా పెరిగింది. కేవ‌లం మ‌న దేశం లోనే కాకుండా చాలా దేశ‌ల‌లో చైనా మొబైల్స్ ను నిషేధించాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

చైనా మొబైల్స్ ను బ్యాన్ చేయాల‌ని డిమాండ్ పెర‌గ‌డానికి మ‌రో కార‌ణం ఎంటంటే భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాలు. చైన మొబైల్స్ వాడ‌టం వ‌ల్ల యూజ‌ర్స్ వ్య‌క్తి గ‌త డేటా ను చైన దొంగిలిస్తుందనే వాద‌న కూడా ఉంది. ఇప్ప‌టికే భార‌తదేశంలో భద్ర‌తా కార‌ణాల‌తో చాలా వ‌ర‌కు చైనా యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొల‌గించారు. తాజాగా ఒక దేశంలో ఏకంగా చైనా మొబైల్స్ ను నిషేధించారు. లిథుయేనియా  దేశంలో అక్క‌డి ప్ర‌భుత్వం చైనా ఫోన్ల‌ను పూర్తి గా బ్యాన్ చేసింది. త‌మ దేశంలో ఎవ‌రూ కూడా చైనా మొబైల్స్ ను కోన‌డానికి వీలు లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా కొని ఉంటే వాటిని విసిరి కొట్టాల‌ని పిలుపు నిచ్చింది.

అయితే లిథుయేనియా ప్ర‌భుత్వం వాద‌న ఎంటి అంటే త‌మ దేశంలో పౌరుల వ్య‌క్తి గ‌త స‌మాచారాన్ని చైనా దేశం దొంగ‌లిస్తుంది అని. దీని కోసం చైనా లో త‌యారు అయినా మొబైల్స్ ను వాడుకుంటుంద‌ని వారి ఆరోప‌ణ‌. దీని పై ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ కు చెందిన నేష‌న‌ల్ సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ ఒక నివేదిక ను సైతం తయారు చేసింది. దీని ప్ర‌కారం చైనా మొబైల్స్ కొన్ని ప‌దాల‌ను ఆటో మేటిక్ గా సెన్సార్ షిప్ చేస్తుంద‌ట‌. త‌మ దేశంలో 449 ప‌దాల‌ను చైనా మొబైల్స్ సెన్సార్ షిప్ చేస్తుంద‌ని త‌మ నివేదికలో తెలిపింది. అయితే ఈ నివేదిక చైనా కంపెనీ లు షియోమీ, హువాయి స్పంధించాయి. తామ కంపెనీల ఫోన్లు ఎలాంటి సెన్సార్ షిప్‌లు చేయ‌డం లేద‌ని చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: