ముచ్చటగా మూడోసారి

Vennelakanti Sreedhar
ముచ్చటగా మూడోసారి

 
కరోనా మెడలు వంచి ఆ మహమ్మారిని అణచి వేశాడు ఒక యోధుడు. అతని చర్యలకు ప్రపంచమంతా శభాష్ అన్నారు. ఆ యోధుడు తాను సాధించిన విజయమే తనకు దేశ ఎన్నికల్లో  విజయాన్ని చేకూర్చి పెడుతుందని ఆశించారు. ప్చ్... లాభం లేకుండా పోయింది. అంచనాలు తారుమారయ్యాయి.ఓటరు దేవుళ్లు ఎప్పుడు ఎవరిని ఎలా కరుణిస్తారో ఎవరికి ఎరుక.
కెనడా దేశపు ప్రధాన మంత్రిగా  జస్టిస్ ట్రూడో ముచ్చటగా మూడో సారి ఆ పదవిని అధిషించ నున్నారు. పదవిని చెపట్టడానికి అవసరమైన మెజార్జీ అతనికి  రాలేదు. మిత్ర పక్షాల మద్దతుతో పదవిని అధిష్టించనున్నారు. 2019 నుంచి  కోరనా మహమ్మారి నియంత్రించడంలో మాత్రమే సఫలీకృతులయ్యారు. ఫలితంగా దేశంలో ఇతర పనులు చేపట్టడం లోనూ, ప్రజలకు దగ్గరవడంలో ఆశించినంతగా ఆయన సఫలీకృతులు కాలేదు. దీంతో ఆయనకు పదవిని చేపట్టేందుకు అవసరమైన సభ్యులను గెలిపించు లేకపోయారు. ఇతర రాజకీ పక్షాల మద్దకు తీసుకోవడంలో మాత్రం కొంత విజయం సాధించారు.
కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ లో338 స్థానాలున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలు 2019 నాటి ఫలితాలనే పునరావృతం చేశాయి.  170 స్థానాల మజిక్ మార్కును ఏ పార్టీ దాటలేదు.భారత్ మూలాలున్న ఇండో-కెనడియన్ లు 17 మంది ఈ ఎన్నికల్లో విజయ దుంధుభి మ్రోగించారు. ప్రతిపక్ష  కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు ఎరిక్ 121 స్థానాల్లో తమ అభ్యర్ధుల్ని గెలిపించుకున్నారు. ఆయన తన ఓటమిని అంగీకరించారు. 27 స్థానాలు దక్కించుకున్న న్యూ డెమోక్రాటిక్ పార్టీ ట్రూడోకు మద్దతు తెలిపింది. దీంతో ముచ్చటగా మూడోసారి ట్రూడో ప్రధాని పీఠం అధిష్టించనున్నారు. తనకు మరలా అధికా పీఠం కట్టబెట్టిన ప్రజలకు, మద్దతు తెలిపిన  ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరికీ శరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నానని ట్రూడో అన్నారు. కాగా  ముందస్తు ఎన్నికలకు వచ్చి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: