ఆ స్టార్ కుటుంబానికి UAE అరుదైన కానుక‌!

Dabbeda Mohan Babu
త‌మ దేశానికి సేవ చేసిన వారికి uae ప్ర‌భుత్వం కానుక‌లు ఇస్తూ ఉంటుంది. 2019 నుంచి వారికి గోల్డెన్ వీసాల‌ను జారీ చేస్తుంది. తాజా ఇప్పుడు ఒక్క‌ప్ప‌టి స్టార్ హిరోయిన్ దివంగ‌త శ్రీ దేవి కుటుంబానికి uae ప్రభుత్వం గోల్డెన్ వీసా ను జారీ చేసింది. ఈ గొల్డెన్ వీసా ప‌ది సంవ‌త్స‌రాల పాటు కాల‌ప‌రిమితి ఉంటుంది. గ‌తంలోనూ దేశం నుంచి చాలా మంది ప్ర‌ముఖుల‌కు uae ప్ర‌భుత్వం గొల్డెన్ వీసా ను విడుద‌ల చేసింది. కాగ తాజా బోని క‌పూర్ కుటుంబానికి ఈ గొల్డెన్ వీసాను uae ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. త‌మ కుటుంబానాకి గొల్డెన్ వీసా విడుద‌ల చేసిన uae ప్ర‌భుత్వ పాల‌కుల‌కు బోని క‌పూర్ కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు.

గ‌తంలోనూ మ‌న దేశానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు గోల్డెన్ వీసా అందుకున్నారు. సీని రంగంలోనూ చాలా మంది న‌టులు ఈ గొల్డెన్ వీసా ల‌ను అందుకున్నారు. మొద‌ట‌గా బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ అందుకున్నారు. ఆయ‌న‌తో పాటు సంజ‌య్ ద‌త్ కూడా uae ప్ర‌భుత్వం నుంచి గోల్డెన్ వీసా ను తీసుకున్నారు. అలాగే మ‌ల‌యాళ ఇండస్ట్రీ నుంచి మొద‌ట మోహ‌న్ లాల్ ను వ‌రించింది. ఆయ‌న త‌ర్వాత ముమ్మ‌ట్టి కూడా ఇటీవ‌లే గోల్డెన్ వీసా ను అందుకున్నారు. తాజాగా బోని కపూర్ కుటుంబానికి ఈ ఆదృష్టం ద‌క్కింది. గోల్డెన్ వీసా త‌మ కుటుంబానికి రావ‌డం త‌మ కుటుంబానికి ద‌క్కిన అరుదైన గౌరవం మ‌ని అన్నారు. కాగ గ‌తంలో దుబాయ్ లోనే శ్రీ దేవీ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. శ్రీ దేవీ చ‌నిపోయిన‌ప్పుడు uae ప్ర‌భుత్వం భార‌త‌దేశానికి అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రించింది.

కాగ uae  ప్ర‌భుత్వం త‌మ దేశంలోని వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి గోల్డెన్ విసా ను ఇస్తుంది. దీని ద్వారా దుబాయ్‌లో దీర్ఘ‌కాలికంగా నివాసాన్ని ఎర్పాటు చేసుకోవ‌చ్చు. దీన్ని పెట్టుబ‌డిదారులు, అత్యుత్త‌మ ప్ర‌తిభ గ‌ల వ్య‌క్తులు, ప‌రిశోధకుల‌కు తో పాటు వైద్య నిపుణుల‌కు గోల్డెన్ విసా ల‌ను అందిస్తుంది. ఇది సాధార‌ణంగా ప‌ది లేదా ఐదు సంవ‌త్స‌రాల పాటు కాలప‌రిమితి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: