ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. ఇకపై టీడీఎస్‌ అలా కట్టొచ్చు..!

Suma Kallamadi
మీరు ప్రవాసులా.. భారతదేశంలో ఆస్తులు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. అయితే భారత కేంద్ర ప్రభుత్వం మీకు ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు స్వదేశంలో ఆస్తులు కొనాలంటే రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలోనే టీడీఎస్‌ను కట్టాల్సి వచ్చేది. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలలో సడలింపులు ప్రకటించింది. కొత్త నిబంధన ప్రకారం ఎన్నారైలు రిజిస్ట్రేషన్ సమయంలో టీడీఎస్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం టీడీఎస్‌ చెల్లించడం తప్పనిసరి. కాగా, 30 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఉదాహరణకు ఈరోజు మీరు ఆస్తులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే.. గతంలో లాగా టీడీఎస్‌ ఈరోజే కట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు నుంచి 30 రోజుల లోపు ఎప్పుడైనా మీరు ప్రభుత్వానికి టీడీఎస్‌ చెల్లించవచ్చు.

అయితే పాత నిబంధనలను సవరించిన కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ ఆఫీసులన్నిటికీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా సడలింపు లతో ఎన్నారై వ్యక్తులకు మరింత ఊరట లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకుని భారతదేశంలో ఆస్తులు కొనుగోలు చేసుకోవాలనే కోరిక చాలామంది మధ్యతరగతి వ్యక్తుల్లో ఉంటుంది. కానీ స్వదేశంలో ఆస్తుల కొనుగోలకు చెల్లించాల్సిన డబ్బుతో సహా అదనంగా పన్నులు చెల్లించాల్సి వస్తోంది. అది కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే ప్రభుత్వానికి అందించాల్సిన పరిస్థితి రావడంతో ఎన్నారైలు చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
టీడీఎస్ కట్టని పక్షంలోనే ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి రిజిస్ట్రార్లు నిరాకరించేవారు. దాంతో ప్రవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ సరికొత్త ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఎన్నారైలు కాస్త ఆలస్యంగానైనా టీడీఎస్ చెల్లించవచ్చు. టీడీఎస్ అనేది కొనుగోలు చేసే ఆస్తిని బట్టి నిర్ణయిస్తుంది ప్రభుత్వం. తాజా సవరణ ప్రకారం 30 రోజులలో టీడీఎస్ చెల్లించకపోతే రిజిస్టర్ రద్దు అయ్యే ప్రమాదం ఉంది. ప్రవాసులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఏమైనా 30 పన్ను చెల్లించడానికి 30 రోజుల పొడిగింపు ప్రభుత్వం ప్రకటించడం నిజంగా ఒక శుభవార్తే అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: