జగన్ అమెరికా టూర్...?

Gullapally Venkatesh
విదేశీ పర్యటనల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన మారాల్సిన అవసరం ఉందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల విషయంలో పెద్దగా దృష్టి సారించలేదు. దీని కారణంగా సమస్యల తీవ్రత కూడా పెరిగింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు విదేశాలకు వెళ్లాల్సినా ముఖ్యమంత్రి జగన్ మాత్రం వెళ్లే ప్రయత్నం చేయక పోవడంతో పెట్టుబడులు కూడా పెద్దగా రాష్ట్రానికి వచ్చే అవకాశం కనబడటం లేదు.

అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి విదేశీ పెట్టుబడులు వస్తే  రాష్ట్రానికి కొన్ని రకాల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయినా సరే కొంచెం కూడా ముందుకు వెళ్ళలేక పోవడంతో సమస్యల తీవ్రత పెరిగి పోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు జగన్ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆయన అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని అంచనాలు వేస్తున్నారు.

దీనికి సంబంధించి త్వరలోనే ఆయన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ అనుకూలంగానే ఉన్నారు. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తే నిరుద్యోగ రేటు కాస్త తగ్గే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మారిన పరిణామాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపించలేదు. దీని కారణంగా కొన్ని సమస్యలు ఎక్కువగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు జగన్ దృష్టి పెట్టక పోతే మాత్రం సమస్య తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: