న్యాయం చేయండి..అమెరికాలో భారత మహిళ న్యాయపోరాటం..!!!

VIKRAM

కరోనా దెబ్బకి అల్లకల్లోలం అయిపోయిన అమెరికాలో ప్రస్తుతం నిరుద్యోగం తాండవం చేస్తోంది. కంపెనీలు మూసివేయడంతో దిక్కు తోచని స్థితిలో గందరగోళంగా మారిపోయింది. ఇక అధ్యక్షుడు ట్రంప్ ఇదే అదనుగా వర్క్ వీసాలు అన్నిటిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలస వాసులు అమెరికా నుంచీ వెళ్ళిపోతే తమ అమెరికన్స్ కి ఉద్యోగాలు వస్తాయని వచ్చే ఎన్నికల్లో తనకి ఈ పరిణామాలు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన ట్రంప్ ఆదిశగా ఈ చర్యలను  వేగవంతం చేశారు. అయితే ట్రంప్ ఆదేశాలకి అనుగుణంగా చర్యలు చేపట్టిన ఇమ్మిగ్రేషన్ వర్క్ వీసాలపై ఆంక్షలు విధించింది.     దాంతో పలు కంపెనీలు, విద్యాసంస్థలు ట్రంప్ ప్రభుత్వం విధానాలపై కోర్టుకెక్కారు..ఈ క్రమంలోనే..

అమెరికాలో వర్క్ వీసాతో ఉంటున్న భారతీయురాలు  అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పై కోర్టులో దావా వేశారు. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తనకి న్యాయం చేయడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. వివరాలలోకి వెళ్తే...రంజితా సుబ్రహ్మణ్యం తన భారతతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఆమె భర్త ఎంతో కాలంగా హెచ్-1బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రంజిత కూడా హెచ్-4వీసాతో అమెరికాకి వచ్చి ఉద్యోగం చేస్తోంది. తన హెచ్-4 వీసా ఎంప్లాయిమెంట్ ఆధరైజేషన్ పొడిగించాలని కోరుతూ రంజిత కోర్టులో ఏప్రియల్ లో ధరఖాస్తు  చేశారు, ఆమె అభ్యర్ధనను ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కూడా ఆమోదం తెలిపింది..కానీ

రంజిత కి ఇప్పటి వరకూ పర్మిట్ కార్డ్ జారీ చేయలేదు సరికదా సరైన సమాధానం కూడా వారినుంచీ రాకపోవడంతో ఆందోళన చెందింది. ఇదిలాఉంటే ఆమె వర్క్ పర్మిట్ జూన్ 7 తేదీతోనే ముగిసిపోగా ఇప్పటి వరకూ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ సమస్యని పరిష్కరించలేదని ఆమె కోర్టులో దావా వేశారు. ఆగస్టు 9 లోపు తనకి వర్క్ పర్మిట్ ఇవ్వకపోతే తాను ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని తన ఆర్జీలో పేర్కొన్నారు. తనకి న్యాయం జరిగే విధంగా అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కి ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని అభ్యర్ధించారు రంజిత.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: