న్యూజిలాండ్‌లో తెలుగోడి నేరం...యూనివ‌ర్సిటీకి న‌ష్టం...కోటి 73 ల‌క్ష‌లు ఫైన్ వేసి...

Pradhyumna

న్యూజిలాండ్‌లో తెలుగోడికి అర‌దండాలు ప‌డ్డాయి. భారీ నేరం చేయ‌డంతో ఆయ‌న‌కు పెద్ద ఎత్తున జ‌రిమానా విధించారు. న్యూజిలాండ్‌ వర్సిటీకి చెందిన కంప్యూటర్లను యూఎస్‌బీ టెక్నాలజీ ద్వారా థంబ్‌ డ్రైవ్‌ని ఉపయోగించి కంప్యూటర్లు ధ్వంసం చేసిన కేసులో ప్రవాస భారతీయుడు ఆకుతోట విశ్వనాథ్‌ను (27) ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈకేసులో విశ్వనాథ్‌కు 10ఏండ్ల జైలు శిక్ష, 250,000డాలర్ల ( రూ.కోటీ 73లక్షలు ) జరిమానా విధించినట్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 


ప్రాసిక్యూషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం...న్యూజిలాండ్‌లో నివాసముంటున్న విశ్వనాథ్‌ ఈనెల14న అమెజాన్‌ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా యూఎస్‌బీ కిల్లర్‌ని కొనుగోలు చేశాడు. అనంతరం ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి న్యూయార్క్‌ వర్సిటీకి చెందిన 59 కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. కంప్యూటర్లు పనిచేయకపోవడానికి గల కారణాలను వర్సిటీ యాజమాన్యం గుర్తించింది. విశ్వనాథ్‌పై అనుమానం వ్యక్తం చేసిన వర్సిటీ వీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతివాదిని కఠినంగా శిక్షించాలని, అతని చర్యల కారణంగా పిటిషనర్‌కు 40లక్షల నష్టం వాటిల్లిందని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు పరిహారం ఇప్పించాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి పై ఆదేశాలు జారీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: