అమెరికాలో తెలుగు మహిళలకోసం ...“WETA”

frame అమెరికాలో తెలుగు మహిళలకోసం ...“WETA”

NCR

అమెరికాలో తెలుగు వారికోసం ఎన్నో  సంఘాలు ఏర్పడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు  లెక్కకి మించిన తెలుగు సంఘాలు అమెరికాలో ఉన్నాయి. ఏ సంఘం కొత్తగా ఏర్పడినా సరే అందరూ తెలుగు వారికి సహాయ సహకారాలు అందించడం. ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం, మొదలగు సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.

Image result for women empowerment telugu association
 

అయితే అమెరికాలో తెలుగు మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సంఘాన్ని టాటా మాజీ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఏర్పాటు చేశారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ పేరుతో ఈ సంఘాన్ని ఆమె ఉమెన్స్‌ డే రోజున ప్రకటించారు. ఇది తెలుగు మహిళల కోట అని, స్త్రీ ప్రగతి పథమే మా బాట అని కూడా ఆమె లోగోలో పేర్కొన్నారు.

 

Image result for women empowerment telugu association

ఇదిలాఉంటే ఈ సంఘానికి అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్‌, ప్రెసిడెంట్‌ కూడా అయిన ఝాన్సీరెడ్డి ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటుతామన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇప్పుడు ఉంటున్న తెలుగు సంఘాలలో తగు న్యాయం జరగడం లేదని అందుకే కొత్తగా కేవలం మహిళల  కోసమే ఈ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశామని ఝాన్సీ రెడ్డి తెలిపారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: