సిద్ధార్థ్ కీ టైమొస్తుంది

 2013 సిద్ధార్థ్ టైమ్ అంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది వేసవి నాటికే సిద్ధూవి కనీసం ఆరు సినిమాలు విడుదల కావచ్చు. తెలుగు హీరోల్లో సిద్థార్థ్ ని దురదృష్టం వెంటాడుతోంది. ఈ ఏడాది విడుదలైన లవ్ ఫెయిల్యూర్ నిరాశే మిగిల్చింది. కానీ, ఆ తరవాత సిద్ధూ నిరాశ పడకుండా షూటింగ్ లలో మునిగిపోయాడు. తెలుగులో అలా మొదలైంది ఫేమ్ నందినీ రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. అది దాదాపు పూర్తి కావచ్చిందట. తమిళంలో చేస్తున్న ఎన్ హెచ్ 4 సినిమా కూడా జనవరికల్లా పూర్తవుతుందట. ఇవికాక మరో రెండు తమిళ సినిమాలు, ఒక హిందీ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇవన్నీ ఎలా లేదన్నా వేసవి నాటికి షూటింగ్ పూర్తిచేసుకుని విడుదల కావచ్చు. ఇందులో తెలుగులో ఒకే ఒక్క సినిమా ఉంది. అంటే, వచ్చే ఏడాది ప్రథమార్థం వరకూ సిద్ధూ మరో తెలుగు సినిమా చేసే అవకాశం లేదు. మొత్తమ్మీద వచ్చే ఏడాది సుమారు అరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సిద్ధూ. అవన్నీ సిద్ధూను ఏం చేస్తాయో? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: