బాలయ్యను పొగడ్తలతో ముంచేస్తున్న సెక్సీ బ్యూటీ !

Seetha Sailaja
బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కత్రీనా కైఫ్ కు హఠాత్తుగా నందమూరి సింహం బాలకృష్ణ గుర్తుకు రావడమే కాకుండా ఏకంగా బాలయ్యను పొగడ్తలతో ముంచేస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయి నిర్మాతల చేత కోట్లకు విలువ చేసే డైమెండ్ నక్లెస్ లు బహుమతులుగా పొందుతున్న కత్తి లాంటి కత్రీనాకు ఇప్పుడు ఇలా బాలయ్య గుర్తుకు రావడం ఆశ్చర్యకరం. ఈ మధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా బాలయ్య పై ఈ పొగడ్తల వర్షం కురిపించింది. ఇక వివరాలలోకి వెళితే కత్రినా టాప్ హీరోయిన్ కాకముందు చాల సంవత్సరాల క్రితం బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ సినిమాలో నటించింది. ఆ సినిమా అప్పట్లో భయంకరమైన ఫ్లాప్ అయితే ఆ సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో బాలకృష్ణ కత్రీనాల పై షూట్ చేసిన ఒక రొమాంటిక్ సాంగ్ లో బాలకృష్ణ నుండి తాను చాల డాన్సింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను అని చెపుతోంది కత్రీనా. అంతేకాదు బాలయ్య తనకు ఆ సినిమా షూటింగ్ విషయంలో ఎంతో సహకరించాడు అని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది ఈ సెక్సీ బ్యూటీ.  ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో ఉన్న కత్రీనాకు ఇప్పుడు బాలయ్య ఎందుకు గుర్తుకు వచ్చాడు అదీకాకుండా బాలయ్య అభిమానులే మర్చిపోయిన ఆ భయంకరమైన ఫ్లాప్ సినిమా ‘అల్లరి పిడుగు’ కత్రీనాకు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది అనే విషయాలు సమాధానంలేని ప్రశ్నలు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: