రెబల్ కు భారీ రెస్పాన్స్

Prasad
ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. డార్లింగ్, మిష్టర్ ఫరఫెక్ట్ సినిమాల తరువాత వస్తున్న ప్రభాస్ కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తన పెదనాన్న బిరుదు అయిన రెబల్ టైటిల్ లో యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ రెబల్ కు భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోనే రెబల్ సినిమాకు 30 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఇది ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక మని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఒక్క నైజాం ప్రాంతపు హక్కులనే ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ 9 కోట్ల రూపాయిలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. రెబల్ భారీ హిట్ అయితేనే ఈ మొత్తం తిరిగి వస్తుందని మర్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకూ మగధీర, దూకుడు, గబ్బర్ సింగ్ చిత్రాలు మాత్రమే నైజాంలో పది కోట్ల రూపాయిల వసూలు సాధించాయి. దిల్ రాజ్ ఏ ధైర్యంతో ఇంత పెద్ద మొత్తానికి ఈ రెబల్ ను దక్కించుకున్నాడో అని మార్కెట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వైజాగ్ హక్కులను మరో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సొంతం చేసుకున్నారు. ఇందు కోసం ఆయన దాదాపుగా 3 కోట్ల రూపాయలను చెల్లించారు. ఇది కూడా అత్యధిక మొత్తమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. జులాయి, శిరిడి సాయి వంటి సినిమాలకు కోటి యాభై లక్షల వరకూ చెల్లించారు. అలాగే సీడెడ్, కృష్ణా, గంటూరు ప్రాంతాల్లో కూడా రెబల్ మంచి బిజినెస్ చేసింది. ఇక శాటి లైట్ రైట్స్ విషయానికి వస్తే, 5 కోట్ల 50 లక్షలు చెల్లించి ఒక ప్రముఖ టివి ఛానెల్ రెబల్ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ రెబల్ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.       

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: